చికాగోలోని ట్రైస్టేట్ తెలుగు అసోసియేషన్ (TTA) నవంబర్ 11న దసరా మరియు దీపావళి వేడుకలు స్థానిక హిందూ టెంపుల్ ఆఫ్ లేక్ కౌంటీ ఆలయ ప్రాంగణంలో సంస్థ అధ్యక్షులు శ్రీ హేమచంద్ర వీరపల్లి ఆధ్వర్యంలో ఎంతో వైభవోపేతంగా జరుపుకుంది.
ప్రసాద్ మరువాడ, హేమంత్ పప్పు, ప్రశాంతి తాడేపల్లి, గుప్త నాగుబండి ఆధ్వర్యంలో సోమలత ఎనమందల, అర్చన మిట్ట ఏర్పాటు చేసిన ఈ TTA (Tri-State Telugu Association) కార్యక్రమాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా నడిపించారు.
సోమలత ఎనమందల మరియు హేమంత్ పప్పు గారి అద్భుత వేదిక అలంకరణ ప్రేక్షకుల కనువిందు చేసింది. విద్య మరువాడ ఈ దసరా మరియు దీపావళి వేడుకల కార్యక్రమానికి వ్యాఖ్యాత గా విజయావంతముగా నిర్వహించారు.
చికాగో (Chicago) లో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి జగదీశ్ కానూరు, శ్రీనాథ్ వాసిరెడ్డి, వీరాస్వామి అచంట, రామకృష్ణ కొర్రపోలు, దిలీప్ రాయలపూడి, భాను సిరమ్, గుప్త నాగుబండి, రవి వేమూరి, అపర్ణ అయ్యలరాజు ఎంతో తోడ్పడ్డారు.
ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో వచ్చిన సభ్యుల నడుమ అన్ని వయస్సుల వారు పాల్గొని, తెలుగు సంస్కృతి ని ప్రతిఫలించే సంగీత, నాట్య కార్యక్రమాలతో పాటు, చిత్ర గీత నృత్యాలు మరియు పాటలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.
ఈ కార్యక్రమానికి TANA (Telugu Association of North America) సభ్యులు హేమ కానూరు, హనుమంతు చెరుకూరి, రవి కాకర, సందీప్, చిరు గల్లా విచ్చేసి పార్టిసిపంట్స్ కి సర్టిఫికెట్స్ (Participation Certificates) బహుకరించి ప్రోత్సహించారు.
శ్రీనివాస్ పెద్దముల్లు, సాయినాథ్ బోయపల్లి మరియు రమేష్ నాయకంటి ఈ కార్యక్రమానికి విచ్చేసారు. వాలంటీర్స్ రామకృష్ణ తాడేపల్లి, లీల ప్రసాద్ వీరపల్లి, మిథున్ యనమదల మరియు నవీన్ యనమందల తమ సహకారాన్ని అందించారు.