Connect with us

Picnic

సేద తీరేలా డాలస్ తెలంగాణ ప్రజా సమితి వనభోజనాలు మే 22 న

Published

on

డాలస్ తెలంగాణ ప్రజా సమితి ‘టిపాడ్’ మే 22 న వనభోజనాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక పైలట్ నాల్ పార్కులో ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆహ్లదకరమైన ప్రోగ్రామ్స్ తో సరదాగా గడిపేలా తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ కార్యవర్గం ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ అనంతరం నిర్వహించే ఈ మొదటి వనభోజనాలు డాలస్ పరిసర ప్రాంతాల వారు సేద తీరేలా ఉండనున్నాయి.

జిహ్య చాపల్యం తీర్చేలా భోజనాలతోపాటు ఫ్లాష్ మాబ్, అంత్యాక్షరి, కుర్చీలాట, కైట్ ఫ్లైయింగ్, కిడ్స్ కి ఫేస్ పెయింటింగ్, లెమన్ స్పూన్ వంటి ఫన్ ప్రోగ్రామ్స్ రెడీ చేస్తున్నారు. సరదాగా వారాంతం సేద తీరేలా, స్వచ్ఛమైన గాలిని అచ్చమైన పచ్చదనాన్ని ఆస్వాదించేలా తెలంగాణ ప్రజా సమితి వనభోజనాలు ఉంటాయి. మరిన్ని వివరాలకు http://tpadus.org/ ని సందర్శించండి.

error: NRI2NRI.COM copyright content is protected