Connect with us

Music

అలా అట్లాంటాపురంలో; అక్టోబర్ 29న తమన్ లైవ్ మ్యూజికల్ షో

Published

on

అట్లాంటాలో టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులు ఎస్ ఎస్ తమన్ లైవ్ మ్యూజికల్ షో అక్టోబర్ 29న నిర్వహిస్తున్నారు. అలా అట్లాంటాపురంలో అంటూ శ్రీ కృష్ణ విలాస్ ప్రజంట్ చేస్తున్న ఈ గ్రాండ్ మ్యూజికల్ ఫెస్ట్ కి జార్జియా వర్ల్డ్ కాంగ్రెస్ సెంటర్ లోని సిడ్నీ మార్కస్ ఆడిటోరియం, బిల్డింగ్ ఏ వేదిక.

వరుస సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డ్రమ్స్ స్పెషలిస్ట్ శివమణి, ఫ్లూటిస్ట్ నవీన్ కుమార్, యాంకర్ శ్రీముఖి, సింగర్స్ శ్రీకృష్ణ, పృథ్వి చంద్ర, శుభశ్రీ, వెంకట్, సుభాని, శాండిల్య, శృతి రంజని, హారిక, సాకేత్, శ్రీ సౌమ్య, రమ్య బెహరా, మనీషా తదితరులు అట్లాంటా సంగీత ప్రియులను అలరించనున్నారు.

శివ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాన్స్ వారి ప్రత్యేక పెర్ఫార్మన్సెస్ అదనం. అక్టోబర్ 29 శనివారం రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించే ఈ మ్యూజికల్ మస్తీ వివరాలకు పై ఫ్లయర్ చూడండి. టిక్కెట్స్ కొనుగోలుకు www.NRI2NRI.com/AlaAtlantaPuramlo ని సందర్శించండి లేదా ఫ్లయర్ లో ఉన్న ఆర్గనైజర్స్ కి కాల్ చెయ్యండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected