Connect with us

Events

TLCA ఉగాది & శ్రీరామ నవమి వేడుకలు ఏప్రిల్ 20న @ New York

Published

on

తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది మరియు శ్రీరామ నవమి వేడుకలను తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (TLCA) ఏప్రిల్ 20 శనివారం రోజున నిర్వహిస్తున్నారు. న్యూయార్క్ (New York) లోని స్థానిక హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా (The Hindu Temple Society of North America) ఈ వేడుకలకు వేదిక.

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) వారి పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, తెలుగు సినిమా పాటలు, విందు భోజనం అందరినీ ఆకట్టుకోనున్నాయి. ఆర్ పి పట్నాయక్ ట్రూప్ మ్యూజికల్ కాన్సర్ట్ (Musical Concert) మరో ప్రత్యేకత. ఈ ట్రూప్ లో టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్స్ (Tollywood Playback Singers) కౌసల్య, రోహిత్, శ్రీకాంత్, శృతి ఉన్నారు.

పదునైన సంభాషణలతో వ్యాఖ్యాత సాహిత్య వింజమూరి అలరించనున్నారు. మద్దిపట్ల ఫౌండేషన్ (Maddipatla Foundation) వారు రాఫుల్ బహుమతులు స్పాన్సర్ చేస్తున్నారు. Telugu Literary & Cultural Association (TLCA) యూత్ ప్రజంట్ చేస్తున్న బాల రామాయణం ప్రత్యేకతను సంతరించుకుంది. మరిన్ని వివరాలకు ఫ్లయర్స్ చూడండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected