Connect with us

News

New York TLCA వారి సంక్రాంతి & రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జనవరి 27న

Published

on

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (Telugu Literary & Cultural Association – TLCA) వారు 2024 జనవరి 27, శనివారం రోజున సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. న్యూయార్క్ (New York) లోని ఫ్లషింగ్ పట్టణంలోని హిందూ టెంపుల్ ఈ వేడుకలకు వేదిక.

2024 సంవత్సరానికి కిరణ్ రెడ్డి పర్వతాల (Kiran Reddy Parvathala) అధ్యక్షతన TLCA నూతన కార్యవర్గం ఎన్నికైన అనంతరం నిర్వహిస్తున్న మొట్టమొదటి కార్యక్రమం ఈ సంక్రాంతి & రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాలు, ముచ్చట గొలిపే నృత్యాలు, తెలుగు సినీ పాటలు, విందు భోజనం, భోగి పళ్ళు, గాలిపటాల పోటీలు అందరినీ ఆకట్టుకోనున్నాయి.

అలాగే తెలుగు సినీ ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ (Raghu Master), సింగర్స్ సమీర భరద్వాజ్ (Sameera Bharadwaj), పృథ్వి చంద్ర (Prudhvi Chandra), రేడియో జాకీ హేమంత్ (RJ Hemanth) మరియు కొరియోగ్రాఫర్ మహేశ్వరి (Maheswari) ఈ కార్యక్రమానికి మరింత శోభని తీసుకురానున్నారు.

ఈ సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న వివిధ పోటీల విజేతలకు గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ మరియు మద్దిపట్ల ఫౌండేషన్ (Maddipatla Foundation) వారి ర్యాఫుల్ ప్రైజెస్ అందించనున్నారు. టిక్కెట్స్, రెజిస్ట్రేషన్స్ వంటి వివరాలకు పై ఫ్లయర్ చూడండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected