తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (Telugu Literary & Cultural Association – TLCA) మరియు అసమై హిందూ టెంపుల్ (AsaMai Hindu Temple) సంయుక్తంగా న్యూయార్క్ (New York) లో మొట్టమొదటిసారి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గత వారాంతం మార్చి 16 ఆదివారం నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో దాదాపు 300 మంది ప్రవాసులు ఉచిత సేవలను ఉపయోగించుకున్నారు.
ఈ సందర్భంగా రోగులను వైద్యుల బృందం పరీక్షించింది. బిపి, షుగర్, కొలెస్ట్రాల్, ఫిజికల్ థెరపి ఎవల్యూషన్, బిఎంఐ టెస్టింగ్, మెంటల్ హెల్త్ స్క్రీనింగ్, పబ్లిక్ హెల్త్ ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ మెడికల్ ఐడీ కార్డులు, ఇకెజి టెస్టింగ్, ప్లూ వ్యాక్సిన్ల పంపిణీ, ఉచిత రీడింగ్ అద్దాల పంపిణీ వంటి సేవలను ఈ ఉచిత వైద్య శిబిరంలో అందించారు.
ప్రముఖ డాక్టర్లు రాజావర్మ, సుజనీ వర్మ, బంగారురాజు కొలనువాడ, ఇల్లోర రఫీక్, నీరు కుమార్, గుర్వీందర్ సిద్ధుకుమార్, దాక్షాయని ఆర్ గుట్ట, రాజేశ్ కాకాని, తేజ్ ప్రీత్ సింగ్, శైలజ దామినేని, తరుణ్ వాసిల్, అశోక్ కుకాడియా, సుధ కుంచం, పూర్ణ అట్లూరి, కృష్ణారెడ్డి గుజవర్తి, స్వర్ణలత అల్లూరి, శరత్ వదాద, సునీల్ మెహ్రా, అమిత్ పాండ్య, భామ కొల్లా తదితర డాక్టర్లు ఈ వైద్య శిబిరం (Free Health Camp) లో పాల్గొన్నారు.
దీంతో స్థానిక అసమై హిందూ టెంపుల్ (AsaMai Hindu Temple) లో తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) మొట్టమొదటిసారి నిర్వహించిన ఉచిత వైద్యరం శిబిరం విజయవంతంగా ముగిసింది. రోగులకు అవసరమైన సలహాలతోపాటు మందులు కూడా అందించారు. స్పెషలిస్ట్స్ తో కలిపి దాదాపు 20 మంది ప్రవాస డాక్టర్లు ఈ వైద్య శిబిరంలో పాల్గొని సేవలందించడం విశేషం.
ఆరోగ్య భీమా లేనివారు, విద్యార్థులకు తమ అనారోగ్య విషయాలకు సంబంధించి పరిష్కారం కనుక్కున్నారు. ఆరోగ్య భీమా ఉన్నవారు సెకండ్ ఒపీనియన్ కోసం ఈ సేవలను ఉపయోగించుకున్నారు. అలాగే డాక్టర్ వృత్తిలో ఉన్న స్టూడెంట్స్ షాడోయింగ్ అనుభవం కోసం సీనియర్ డాక్టర్స్ సహాయం తీసుకున్నారు. ఇలా అన్ని విధాలా అందరికీ ఈ ఉచిత వైద్య శిబిరం (Health Camp) ఉపయోగపడింది.
డాక్టర్ రాజా మరియు డాక్టర్ సుజని వర్మ ఈ వైద్య శిబిరానికి స్పాన్సర్ చేయడం అభినందనీయం. ఈ సందర్భంగా అందరూ TLCA సేవలను కొనియాడారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేసినవారందరికీ తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (Telugu Literary & Cultural Association – TLCA) ప్రెసిడెంట్ సుమంత్ రామ్‌సెట్టి () హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
అలాగే TLCA త్వరలో నిర్వహించే ఉగాది పండుగ వేడుకలలో కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సుమంత్ (Sumanth Ramsetti) కోరారు. యూత్ కో ఆర్డినేటర్లు దియా వర్మ, దివ్య దొమ్మరాజుతోపాటు తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు (EC), బోర్డ్ చైర్ఉమన్ రాజి కుంచెం (Raji Kuncham) మరియు మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (BoT) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.