బస్సుల్లో వేల మందిని తెచ్చి వైసీపీ వాళ్ళు దొంగ ఓట్లు వేయించారని, ఫోర్జరీ ఓటర్ గుర్తింపు కార్డులను సృష్టించారని, అందుకు ఆధారాలు ఉన్నాయని తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికను రద్దు చేయండి అంటూ హైకోర్టు తలుపులు తట్టారు బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ. అధికార పార్టీకి చెందినవారు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని, బూత్ ఆక్రమణ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని తెలిపారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దొంగ ఓట్లపై పోలింగ్ రోజే ఆర్వో దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. హైకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.