అమెరికాలోని అలబామా రాష్ట్రం బర్మింగ్‌హామ్ లో దేవదేవుడైన శ్రీ శ్రీనివాసుని కళ్యాణం మునుపెన్నడు లేనివిధంగా Hindu Temple of Birmingham (THTCCB), APNRT, NATA అధ్వర్యంలో కన్నులపండువగా జులై 10, 2022 మ హిందూ టెంపుల్ ఆఫ్ బర్మింగ్‌హామ్ ఆడిటోరియం లో జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి సుమారుగా 450 మంది భక్తులు హాజరై తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు.
టీటీడీ కళ్యాణం ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు శ్రీ కొట్లూరు శ్రీనివాస రెడ్డి (అట్లాంటా) సహకారంతో ఆలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సతీష్ వడ్లకొండ, శ్రావణ్ వంగూరు, వెంకీ పావులూరి, నాగరాజ్ హోస్కోటే, అభిరామ్ పమిడి, భీమ్ పసలా, అప్పారావు మంథా , సందీప్ పరుచూరి,నర్సింహ కూరపాటి, రమేష్ తొడుపునూరి, నరేష్ బనాలా, సుజనేంద్ర యరబోలు, శ్రీ అనిల్ పెద్ది, ప్రేమ్ కుమార్ మీసాల, ధీరజ్ శర్మ, శ్రీకాంత్ కర్రా, అమరేశ్వరి వంగురు, వరుణ పరుచూరి, నవ్య పావులూరు, రమ్య పమిడి, మంజు అథాన్, లావణ్య చకిలం, జ్యోతి పసలా, ప్రీతి పెద్ది, సౌమ్య బానాలా, మణి మంథా, లక్ష్మి వడ్లకొండ, లావణ్య ఆలూరి, అపర్ణ అమిరెడ్డి, రాధిక జంబుల తదితరులు అహర్నిశలు ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి కృషి చేసారు.
బర్మింగ్‌హామ్ హిందూ దేవాలయం చైర్మన్ శ్రీ విశ్వారావు మరియు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మధుసూదన్ తమ పూర్తి సహకారాన్ని అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన అర్చకస్వాములు, వేద పండితులు కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవాచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ, మహా సంకల్పం, కన్యాదానం, మాంగళ్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు.
అమెరికాలో పుట్టి పెరిగిన ఈ తరం పిల్లలకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా స్వామి వారి వేడుకలను నిర్వహించారు. గత రెండు సంవత్సరాలుగా తిరుపతి రాలేని కారణంగా తమ స్వస్థలాలకు రాలేక, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి నోచుకోని వందలాది మంది భక్తుల కొరకు అమెరికాలోని తిరుమల కళ్యాణోత్సవాలు దేవస్థానం ఆధ్వర్యంలో అమెరికాలోని 9 నగరాల్లో శ్రీనివాస కళ్యాణం కారణంగా విదితమే.
ఈ కార్యక్రమంలో నాటా అధ్యక్షుడు శ్రీదర్ కొరసపాటి మరియు నాటా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు సుధీర్ అమిరెడ్డి తో పాటు, SVBC డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, TTD AEO బి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఫోటోల కొరకు క్రింద ఉన్న సురేష్ గ్రాంధి మరియు కృష్ణ గ్రాంధి ఫోటోగ్రఫీ లింక్స్ ని సందర్శించండి.