Connect with us

Meditation

సనాతన భారతదేశ వైమానిక శాస్త్రం – The Vymaanika Shaastra of India

Published

on

భరద్వాజ మహర్షి రాసిన ‘యంత్రసర్వస్వము’ అనే ఉద్గ్రంథములోని 40 అధికరణమైన ‘వైమానిక ప్రకరణము’లో ఆనాటి పనిముట్లు, యంత్రముల చిత్రాలేకాక విమాన డిజైన్ లు కూడా పొందుపరిచారు. దాదాపు 600 పేజీలతో వైమానిక శాస్త్రము రూపుదాల్చింది. ఇది తొలి వైజ్ఞానిక గ్రంథము. భరద్వాజ మహర్షి పేర్కొన్న వైమానిక శాస్త్రంలో యంత్రాలు, పరికరాలు, లోహాల వినియోగం, అందులో పైలట్ తెలుసుకోవలసిన 32 రహస్యాల గురించి వివరించారు. పైలెట్స్ తీసుకోవలసిన శిక్షణ ఎలా ఉండాలనేది కూడా భరద్వాజ మహర్షి చెప్పారు. విమానంలో ముఖ్యమైన 32 భాగాల గురించి, ఆ యంత్రాల పనితీరు గురించి విపులంగా చెప్పారు.

ఇది నేటి టెక్నాలజీ కంటే చాలా అధునాతనమైనదని, ఇప్పుడు విమానంలో తీసుకుంటున్న న్యూట్రిషియన్ టాబ్లెట్స్ వంటివి ఆ కాలంలోనే ఉన్నవని భరద్వాజ మహర్షి తెలియచేశారు. వంద శతఘ్నులు పేల్చినా దెబ్బతినని లోహాన్ని ఆనాటి విమానాల తయారీకి వాడేవారు. మెరుపులలో నుంచి ఎనర్జీ తీసుకోవచ్చని వైమానిక శాస్త్రంలో చేర్చబడింది. నేల మీద, నీటిమీద, ఆకాశంలో సంచరించగలిగే త్రిపుర విమానం గురించి కూడా పేర్కొన్నారు. ఈనాటి ఏరోనాటిక్స్ లో ఉన్న యంత్రసర్వస్వమంతా వైమానికశాస్త్ర గ్రంథంలో ఉంది. విమానసిబ్బంది ఎటువంటి వస్త్రాలను ధరించాలో వివరించారు. ఆహారాధికరణంలో ఎటువంటి ఆహారాన్ని స్వీకరించాలి, లోహాధికరణంలో విమానాల తయారీలో ఉపయోగించే వివిద రకాల లోహాలు, అద్దాలు, లెన్స్ లు, పవర్ జనరేషన్ ఎట్లా చేయాలి వంటి అనేక అంశాలు స్పష్టంగా భరద్వాజ మహర్షి తెలియచేశారు.

భరద్వాజ మహర్షి వ్రాసిన ”యంత్ర సర్వస్వం” ప్రాచీన భారతీయుల వైమానిక విద్యా నైపుణ్యానికి నిదర్శనం. ఈ గ్రంథం బరోడా మహారాజావారి గ్రంథాలయంలో వుంది. దీని ఆధారంగానే బోధానందుని వ్యాఖ్యానంతో ”వైమానిక ప్రకరణం” వెలువడింది. దాదాపు ఏభైవరకు విమాన గ్రంథాలసూచిక ఈ ప్రకరణంలో లభిస్తుంది. అగస్త్యుని ”శక్తిసూత్రం”, ఈశ్వరుని ”సౌదామినీకళ”, ”భరద్వాజుని ‘అంశుతంత్రం”, శాకటాయనుని ”వాయుతత్వ ప్రకరణం”, నారదుని ”వైశ్వానరతంత్రం”, ”ధూమప్రకరణం” వీటిలో ముఖ్యమైనవి. అన్నింటిలో ”యంత్ర సర్వస్వం”, ఎనిమిది అధ్యాయాలు, వంద కాండలు, ఐదువందల సూత్రాలతో విశిష్టంగా పేర్కొనబడింది. ఆకాశంలోనేకాక గాలిలోను, నీటిలోను, పక్షితో సమానమైన వేగంతో పయనించే దానిని ”విమా నం” అంటారని భరద్వా జుడు పేర్కొన్నాడు. 36 రహస్యాలు (సాంకేతిక పరిజ్ఞానం) తెలిసినవాడు విమానాన్ని నడపగలడని అతన్నే ”చోదకుడు” పైలెట్‌ అంటారని ఆయన వివరిం చాడు. ఈ ”యంత్ర సర్వస్వం” ఆధునిక, పాశ్చాత్య వైమానిక విద్యావేత్తల్ని ఆశ్చర్యపరు స్తున్నారని భరద్వాజుడు పేర్కొన్న వైమానిక సాం కేతిక పద్దతుల్లో నాల్గు ముఖ్యమైనవి వున్నాయి.

  1. కృతకరహస్యం : విశ్వకర్మ, మయుడు, మనువు చెప్పిన రీతిలో విమానాలు నిర్మించే పద్ధతిని ఇది వివరిస్తుంది.
  2. గూఢ రహస్యం: విమాన ప్రయాణాలకు దోహదం చేసే వాయువులు, వాటి చలనాల గురించి వివరిస్తుంది. ఆ వాయువుల పేర్లివి. వాస, వైయాస, ప్రయాస- ఈ మూడు వాయువుల్ని వశపర్చుకున్నట్లయితే విమానాన్ని ఎవరికీ కనిపించకుండా నడుపవచ్చునట!
  3. అపరోక్షరహస్యం : పిడుగులవల్ల జన్మించే ఒక రకం ‘విద్యుత్తు’ గురించి ఈ ప్రకరణం వివరిస్తుంది.ఈ విద్యుత్తును వశపర్చుకుంటే విమానం ముందుగల వస్తువుల్ని పైలెట్‌ స్పష్టంగా చూడగలుగుతాడు.
  4. సర్పగమన రహస్యం : సౌరశక్తిని ఉపయోగించి విమానాన్ని సర్పగతిలో నడిపే పద్ధతిని ఈ ప్రకరణం వివరిస్తుంది. ఇలా యంత్ర సర్వస్వం ప్రాచీన భారతీయుల విమాన విద్యా ప్రావీణ్యం గురించి వివరిస్తుంది.

అంతేకాక అతి ప్రాచీనమైన ఋగ్వేదం కూడా విమాన విద్యారహస్య సూక్తాలున్నాయి.
ఋగ్వేదం (5- 41-6) చెప్పిన ”ప్రావోవాయుం రధ యుజం కృధ్వం” అనే సూక్తం వాయు శక్తితో నడిచే వాహ నాలను సూచిస్తుంది. అలాగే సాగర తరం గాలపై సంచరించే వాహనాలు (ఓడలు) గురించి
”సింధోర్‌ ఊర్శ వధి శ్రితఃకరం విబృత్‌ పరిస్పృం” అనే సూక్తం వివరి స్తుంది. ఋహుడు మూడు చక్రాల వాహనాన్ని ఉపయోగించేవాడని గాలిలోనేకాక సముద్రంలో సంచరించే జలాంత ర్గాములు వాడకంలో వున్నాయని ఋగ్వేదం పేర్కొన్నది. ఆవిరి యంత్రాలను వేదకాలపు దాక్షిణికులు ”అగ్నిరథాలు” అనేవారు. త్రిపుర విమానం గురించి పురాణాల్లో వివరణ ఉంది.

అలాగే రామాయణంలో పుష్పకవిమానం గురించి భారత, భాగవతాల్లో సౌభకం వంటి విమానాల గురించి విశేష వర్ణనలు ఉన్నాయి. నారాయణ కృత – విమాన చంద్రిక, శౌనక కృత – వ్యోమయాన తంత్రం, గర్గ కృత – యంత్ర కల్పం. వాచస్పతి కృత – యాన బిందు, చక్రాయణీ కృత – ఖేటయాన ప్రదీపికా, ధుండీనాథ కృత – వ్యోమయానార్క ప్రకాశికా. భరద్వాజ మహర్షి ఈ గ్రంథములో విమానం యొక్క నిర్వచనం,విమానం యొక్క పైలట్ (ఇతనిని రహస్యజ్ఞ అధికారి అని పేర్కొన్నారు ),ఆకాశ మార్గం,వైమానిక దుస్తులు,విమాన యంత్ర భాగములు,ఇంధనము,యంత్రము,దాని నిర్మాణములో ఉపయోగించే ధాతువులు – మొ.లగు వన్నీ పేర్కొన్నారు. విమానాలను యుగానుసారంగా విభజించబడిన వాటిని క్రోడీకరించి ఒకచోట చేర్చారు. అవి కృత ,త్రేతా యుగములలో “మాంత్రిక” అను రకమైన విమానాలు, ద్వాపర యుగములో “తాంత్రిక” అను రకమైన విమానాలు(ఇవి 56 రకాలు), అట్లే కలియుగములో “కృతిక” అనే రకపు విమానాలు ఉంటాయి. ఇవి యాంత్రికాలు.-వీనిలో 25 రకాలుంటాయి.వీనిలో శకున,రుక్మ,హంస,పుష్కర,త్రిపుర మొ.లగునవి ముఖ్యమైనని వివరించారు.

గమనిక: వైమానిక శాస్త్రం పిడిఎఫ్ కూడా ఇక్కడ పొందుపర్చడం జరిగింది.

– సురేష్ కరోతు

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected