Boston, Massachusetts: మొట్టమొదటి సారి టి.ఏ.జీ.బి (Telugu Association of Greater Boston) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొదటి భారతీయ కౌన్సిల్ జెనరల్ శ్రీ.ఎస్.రఘురాం గారికి సన్మానం మరియు ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించింది. శ్రీ.ఎస్.రఘురాం గారు తెలుగు వారు కావడాం అందరికి గర్వకారణం అని ప్రెసిడెంట్ శ్రీనివాస్ గొంది అన్నారు.
ప్రెసిడెంట్ శ్రీనివాస్ గొంది (Srinivas Gondi) సారష్యంలో, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సుధా ముల్పూర్, కార్యదర్శి దీప్తి కొరిపల్లి, కొశాధికారి జగదీష్ చిన్నం, కల్చరల్ సెక్రటరి సుర్య తెలప్రోలు టి.ఏ.జీ.బి ద్వారా మరో చక్కని కార్యక్రమం ఆహుతులకి అందజేసారు. ఇదే వేదికగా మానవతా ధృక్పధంతో మన సమాజంలో సేవలందిస్తున్న ప్రముఖులని సన్మానిచ్చారు.
టీం ఐడ్ వ్యవస్థాపకులు, శ్రీ మోహన్ నన్నపనేని (Mohan Nannapaneni) గారిని సత్కరించడం మాకు చాలా అనందంగా గర్వంగా వుంది. విదేశాలకు ప్రయాణించేటప్పుడు లేదా నివసిస్తున్నప్పుడు సంక్షోభ పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా స్థాపించబడిన ప్రపంచంలోని ఏకైక సంస్థ కి మోహన్ గారు వ్యవస్థాపకులు.
ఇంటి నుండి దూరంగా ఉన్నప్పుడు ఎదుర్కొనే సవాళ్లను అర్థం చేసుకుంతూ, ఎటువంటి నష్టం లేదా దుఃఖ సమయాల్లో సదా ప్రధాన సంప్రదింపు కేంద్రంగా ఉండటానికి టీం ఐడ్ ప్రయత్నిస్తుంది. వారి అసాధారణ మానవతా సేవ మరియు కరుణ తత్పరతకి టి.ఏ.జీ.బి వేవేల వందనాలు అందిస్తుంది.
శ్రీ రమేష్ బాపనపల్లి (Ramesh Bapanapalli) వారి అత్యుత్తమమైన సమాజ సేవ మరియు ఇతరులను ఉద్ధరించడంలో వారి తిరుగులేని నిబద్ధతకి శ్రీ రమేష్ బాపనపల్లి గరిని సత్కరించడం మాకు చాలా అనందంగా గర్వంగా వుంది. వీరి విద్యార్థి ని దత్తత, యువత సాధికారత మరియు బ్యాక్-టు-స్కూల్ డ్రైవ్‌లు అమెరికా నలుమూలలా ప్రసిధ్ధి చెందాయి. ఈ కార్యక్రమాలను నిర్వహించడంలో ఆయన అత్యుత్తమ నాయకత్వానికి టి.ఏ.జీ.బి హృదయపూర్వక వందనాలు అందించింది.
విందు భోజనం-పండగ బంతి భోజనాలు ఆహుతులని విపరీతంగా ఆకర్షించాయి. పిల్లల పౌరాణిక పాత్రల వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్నో అంగడులు, పిల్లల సందళ్ళతో సాంస్కృతిక కార్యక్రమం నిరాఘాటంగా నృత్యాలు, పాటలు ప్రదర్శన తదితర వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో అందరిని ఉర్రూతలూగించింది.
ఆ నాటి ప్రత్యేక ఆకర్షణ గాయనీ గాయకులు అదితి భావరాజు, మనీష ఎర్రబత్తిన మరియు పృధ్వి చంద్రా అద్భుతః అని ఆహుతలను అలరించే డైనమిట్ మ్యుసికల్ ప్రొగ్రాం.టి.ఏ.జీ.బి ప్రత్యేకంగా వ్యయప్రయాసలతో ఏర్పాటూ చేసిన స్పెషల్ లైటింగ్ మ్యుసికల్ ప్రొగ్రాం (Musical program) కి చక్కని “బ్యగ్రౌండ్” అందించింది.
బోర్డ్ ఆఫ్ ట్రస్టిస్ ఛైర్ శ్రీ రవి అంకినీడు చౌదరి (Ravi Ankinidu Chowdary) సారధ్యంలో ట్రస్టిస్ మరియు ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ గొంది సారధ్యంలో కార్య నిరవాహక వర్గం కలిసికట్టుగా పనిచేసిన వినూత్న కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రాంగణాన్ని పండుగ వాతావరణంతో టి.ఏ,జీ.బీవాలంటీర్ల సహకారంతో ఎంతో విజయవంతంగా ఈ కర్యక్రమాన్ని నిర్వహించింది.
2025-26 గవర్నింగ్ బోర్డ్ :ప్రెసిడెంట్ శ్రీనివాస్ గొంది, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సుధ ముల్పుర్, కార్యదర్శి దీప్తి కొరిపల్లి, కొశాధికారి జగదీష్ చిన్నం, కల్చరల్ సెక్రటరి సూర్యా తెలప్రోలు. బోర్డ్ ఆఫ్ ట్రస్టిస్ ఛైర్ రవి అంకినీడు చౌదరి, మెంబర్లు: శేషగిరి రెడ్డి, పద్మావతి భిమ్మన, కాళీదాస్ సురపనేని మరియు ఎక్స్ అఫిసియొ దీప్తీ గోరా.