Women
పండ్ల తోటలో రామచిలుకల వలే Chicago ఆంధ్ర సంఘం మహిళా దినోత్సవంలో కిలకిలలు
Published
5 days agoon
By
Sri Nexus
Chicago, Illinois: గుత్తులుగా విరబూసిన గులాబీ తోటలో అందమైన పచ్చని రామచిలుకలు గుంపులుగా చేరి ఆడుతూ పాడుతూ తుళ్లుతూ సందడి చేసే ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుందో కదా. అచ్చం అలాంటి దృశ్యమే చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) వారి మహిళా దినోత్సవ (Women’s Day) వేడుకల సందర్భంగా ఆవిష్కృతమైనది అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
చికాగో ఆంధ్ర సంఘం వారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మార్చ్ 8, 2025 న గ్లెన్డేల్ హైట్స్ (Glendale Heights) లోని Ramada Banquets నందు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ‘అకేషన్ బై కృష్ణ – కృష్ణ జాస్తి’ ఆధ్వర్యంలో గులాబీ రంగులో అలంకరించిన ప్రాంగణం విరబూసిన గులాబీ తోటను ప్రతిబింబించగా, ఆకుపచ్చ రంగుల దుస్తులతో అందమైన రామచిలుకల వలె అందంగా ముస్తాబైన ఆడపడుచులు ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొని పైన చెప్పిన దృశ్యాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కృతం చేశారు.

చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) 2025 అధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి (Srikrishna Matukumalli), చైర్మన్ శ్రీనివాస్ పెద్దమల్లు (Srinivas Pedamallu), వ్యవస్థాపకులు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు దీప ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో, చికాగో పరిసర ప్రాంతాల నుండి 350 కు పైగా విచ్చేసిన ఆడపడుచులు ఈ కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రముఖ గాయని మరియు వ్యాఖ్యాత అయిన మాధురి పాటిబండ (Madhuri Patibanda) వ్యవహరించారు. కార్యవర్గ సభ్యులు కిరణ్ వంకాయలపాటి, అనురాధ గంపాల, ఒగ్గు నరసింహా రెడ్డి, హేమంత్ తలపనేని సారథ్యంలో కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానితులను నమోదు చేసుకుని వారి వారి జట్టులకు కావలసిన టేబుల్స్ ను కేటాయించారు.

సాహితీ కొత్త, శ్రీ స్మిత నండూరి, శృతి కూచంపూడి, అనూష బెస్త, శైలజ సప్ప ఆధ్వర్యంలోని సాంస్కృతిక విభాగం ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకమైన వినోదాత్మక కార్యక్రమాలను రూపొందించి మహిళా దినోత్సవ (Women’s Day) వేడుకకు వచ్చిన ఆహ్వానితులను అలరించారు.
వీరికి సౌజన్య రాళ్ల బండి, ప్రియా మతుకుమల్లి, సారిక రెడ్డిశెట్టి, మాధురి యేటిగడ్డ, స్రవంతి చల్లా, యశోద వేదుల, సౌమ్య బొజ్జ, గీతిక మండల, హరిణి మేడ తమ సహాయ సహకారాలను అందజేశారు. మొదటగా “అమ్మమ్మ చిట్కాలు” అనే కార్యక్రమాన్ని స్మిత నండూరి మరియు శైలజ సప్ప ప్రారంభిస్తూ మన దైనందిన జీవితంలో ఉపయోగపడే వివిధ రకాల చిట్కాలను ఆహ్వానితులతో పంచుకున్నారు.

వీరితోపాటు కార్యక్రమానికి విచ్చేసిన మహిళల్లో చాలామంది ముందుకు వచ్చి తమకు తెలిసిన విలువైన చిట్కాలను ఆహ్వానితులతో పంచుకున్నారు. శృతి కూచంపూడి, మాధురి , స్వర్ణ నీలపు, స్మిత నండూరి నేతృత్వంలోని బృందం ఆహ్వానితులను అలరించి వారిని ఉత్సాహపరిచే విధంగా టేబుల్ గేమ్‌లను ప్రారంభించారు.
టెలిఫోన్ డాన్స్ ఆటలో ఒక dance step జట్టులోని ఒక సభ్యురాలిని ఇంకొకరు అనుకరిస్తూ చివరి సభ్యురాలికి వెళ్లేసరికే ఎలా మారిందో చూపించిన విధానం ఎన్నో నవ్వులు పూయించింది. అలాగే తల పైన పళ్లెంలో ఉన్న గాజుపాత్రలో రాళ్లను నింపే ఆట ఎంతో వినోదాత్మకంగా సాగింది.

డాక్టర్ దుర్గ కోన (Dr. Durga Kona) గారు ఆరోగ్యవంతమైన సంతోషకరమైన జీవితం గడపటానికి అనుసరించవలసిన మార్గాలను తెలియజేసే ఆలోచనాత్మకమైన ప్రసంగం ఆహ్వానితులను ఎంతగానో ఆకట్టుకుంది. డాక్టర్ ప్రమీల చుండూరు మహిళలకు వచ్చే మెనోపాజ్, ఫ్రీ-మెనోపాజ్ లక్షణాలను వివరిస్తూ ఆ సమయంలో మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తలను చాలా వివరంగా తెలియజేశారు.
ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన “పట్టుకుంటే పట్టు చీర” కార్యక్రమాన్ని సారిక ఇంకా అనూష ఒక అమోఘమైన నృత్యంతో ప్రారంభిస్తూ వివిధ రకాల చీరలను చూపించారు. రెండు అంచెలుగా నిర్వహించిన ఈ పోటీలో విజేతలైన వారికి LakshBySarika, Samaya Ethnic విలువైన ఇంకా అందమైన పట్టు చీరలు బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమం ఆద్యంతం పోటీలో పాల్గొన్న వారినే కాకుండా చూసే వారిని కూడా ఎంతో ఉత్సుకతకు గురిచేసింది.

ఇక ఈ మొత్తం కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకంగా నిలిచిన ఇష్టమైన హీరోయిన్ ఆటలో పాల్గొన్న వివిధ జట్టు సభ్యులు తమకు ఇష్టమైన హీరోయిన్లు అయిన జమున, త్రిష, సాయి పల్లవి, అనుష్క, భానుప్రియ ఇంకా ఇతర నటీమణులు నటించిన దృశ్యాన్ని, పాటని, లేదా డైలాగ్ ని ఎంతో ఉత్సాహంగా అభినయించి చూపించిన విధానం ఆహ్వానితులను ఎంతగానో ఆకట్టుకుంది.
మహిళలలో ఉన్న సృజనాత్మకతని బయటకు తీసే విధంగా నిర్వహించిన దీపాలంకరణ, చిత్రలేఖనం, “Be the హీరోయిన్ ఆఫ్ యువర్ లైఫ్” వంటి పోటీలలో వయసుతో సంబంధం లేకుండా పాల్గొని తమలో ఉన్న కళాత్మక కోణాన్ని వివిధ రకాల దీపాలు, చిత్రాలు ఇంకా వీడియోల రూపంలో ప్రదర్శించారు.

చికాగో ఆంధ్ర సంఘం వ్యవస్థాపక సభ్యులు, ధర్మకర్తలు డాక్టర్ ఉమా కటికి (Dr. Uma Katiki), డాక్టర్ భార్గవి నెట్టెం (Dr. Bhargavi Nettem), మల్లేశ్వరి పెదమల్లు, పవిత్ర కారుమూరి తమ విలువైన సలహాలను సూచనలను అందజేసి ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి, విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందించారు.
ఇక ఈ పోటీలకి సంధానకర్తలుగా సుప్రజ తలపనేని, కిరణ్మయి రెడ్డివారి, శ్వేత కొత్తపల్లి, హరిణి మేడ, ప్రియ మతుకుమల్లి, శిరీష పద్యాల, అనూష బెస్త, సాహితీ కొత్త వ్యవహరించారు. ఇక ఈ కార్యక్రమంలో నిర్వహించిన రాఫిల్ నందు విజేతలుగా నిలిచిన వారికి Desi Chowrastha నుండి మలతీ దామరాజు, స్స్కంద జ్యువెలర్స్ skanda నుండి సవిత మునగ విలువైన బహుమతులను అందచేశారు.

డైరెక్టర్ మురళి రెడ్డివారి (Murali Reddivari), సంస్థ అధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి (Srikrishna Matukumalli) మార్గదర్శకత్వంలో కూల్ మిర్చి రెస్టారెంట్ వారు ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా సమకూర్చిన ఆహార పదార్థాలు ఆహ్వానితులకు నోరూరింపజేశాయి.
CAA బోర్డు యూత్ డైరెక్టర్లు మయూక రెడ్డివారి, శ్వేతిక బొజ్జా, స్మరన్ తాడేపల్లి, మరియు శ్రీయా కొంచాడ వివిధ ప్రధాన బృందాలకు సమగ్రమైన బ్యాకెండ్ మద్దతును అందించడం ద్వారా వారు కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడంలో సహాయం చేశారు. మా అత్యంత ఉత్సాహభరితమైన సీనియర్ డైరెక్టర్ శ్రీమతి లక్ష్మీనాగ్ సూరిభొట్ల అనేక ప్రోమో వీడియోలను సిద్ధం చేయడం ద్వారా బృందానికి సృజనాత్మక మార్గదర్శకత్వాన్ని అందించారు.

చికాగో ఆంధ్ర సంఘం తలపెట్టే ప్రతీ కార్యక్రమానికి తమ సహకారాన్ని అందిస్తూ సంస్థ అభ్యున్నతికి తగిన తోడ్పాటునందిస్తున్న CAA స్పాన్సర్స్ ప్రొఫెషనల్ మార్ట్ గేజ్ సొల్యూషన్స్ నుండి శ్రీ అశోక్ లక్ష్మణన్, మేడా డెంటల్ నుండి డాక్టర్ సత్య మేడనాగ గారులకు సంస్థ అధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
మరియు స్కంద జ్యువెలర్స్ నుండి శ్రీమతి సవిత మునగ, హైపర్ కిడ్స్ నుండి శ్రీమతి మాధురి, మాల్ ఆఫ్ ఇండియా నుండి శ్రీమతి చిన్నాదేవి గారు, మరియు శ్రీకో బ్యాటరీస్ నుండి శ్రీమతి శైలజా సప్పా, ఐ లెవెల్ ఎడ్యుకేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీమతి సరిత, శ్రీమతి ప్రియ మరియు శ్రీమతి ఝాన్సీలకు సంస్థ అధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు, వ్యవస్థాపకులు ఇంకా సలహాదారు పద్మారావు – సుజాత అప్పలనేని ఇతర కార్యవర్గ సభ్యులు నరసింహారావు – శిరీష వీరపనేని, గిరి రావు – ఉమా కొత్తమాసు, రామారావు – రమ్య కొత్తమాసు, ఒగ్గు నరసింహారెడ్డి -గండ్ర పద్మజ , ప్రభాకర్ – శ్రీదేవి మల్లంపల్లి పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి తమ సహాయ సహకారాలను అందించారు.
DesiBeatsByP2 నుండి పావని -ప్రీతి డాన్స్ ఫ్లోర్ పైన కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానితులు అందరితో సరళమైన Dance Stepsతో, అలుపెరుగకుండా డాన్స్ చేయించి ఈ కార్యక్రమాన్ని వచ్చిన ఆహ్వానితులు అందరికీ ఒక మధురానుభూతిని కలిగించారు. వయసుతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన ఏ ఒక్కరూ కూడా కాలు కదపకుండా ఇంటికి వెళ్లలేదు అంటే అతిశయోక్తి కాదు.

ఈ కార్యక్రమానికి DJ గా మెలోడీ మహేష్, ఫోటోగ్రాఫర్ గా కాస్మోస్ డిజిటల్ నుండి సూర్య దాట్ల తమ సేవలను అందించారు. చివరగా చికాగో ఆంధ్ర సంఘం కార్యదర్శి శ్రీస్మిత నండూరి (SriSmitha Nanduri) ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం కోసం గత రెండు నెలలుగా కృషి చేస్తున్న ప్రియా మతుకుమల్లి, సాహితీ కొత్త, అనూష బెస్త, ఇంకా ఇతర కార్యవర్గ సభ్యులు వ్యవస్థాపకులు స్వచ్ఛంద కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.
చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) మహిళా సాధికారతకి సమానత్వానికి ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది. అందుకే ఏ సంస్థలో లేని విధంగా కార్యవర్గ సభ్యులలో ఇంకా సంస్థ అధ్యక్షులలో 50 శాతం మహిళలకు కేటాయించి మహిళా అభ్యున్నతికి పాటుపడే సంస్థలకు ఆదర్శప్రాయంగా నిలిచింది.

చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ ఏటా నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మహిళా అభ్యున్నతికి కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తూ, మహిళలలో ఉన్న సృజనాత్మకతని పదును పెట్టే విధంగా వివిధ రకాల పోటీలు రూపొందిస్తూ, తమ మీద ఉన్న అంచనాలను ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోయే విధానం చికాగో ఆంధ్ర సంఘాన్ని ముందు వరుసలో ఉంచుతుంది.



