Connect with us

Achievements

Kid Heroes for the Planet: తెలుగు చిన్నారులకు అరుదైన గౌరవం, TIME for Kids

Published

on

అమెరికాలో ఇద్దరు తెలుగు చిన్నారులు పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కృషిని ప్రఖ్యాత టైమ్స్ పత్రిక (TIME for Kids) గుర్తించి కిడ్ హీరోస్ ఫర్‌ ది ప్లానెట్ (Kid Heroes for the Planet) పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది. అమెరికాలో ప్రకృతి పరిరక్షణకు వాళ్లు చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ఆ కథనంలో అభినందించింది. 

పర్యావరణం మేలు కోసం రేష్మ కొసరాజు:-

అగ్ని ప్రమాదాలను అంచనా వేసే టెక్నాలజీని 17 ఏళ్ల వయస్సులోనే కనిపెట్టిన రేష్మ కొసరాజు టైమ్స్ కిడ్ హిరోస్ ఫర్ ది ప్లానెట్ జాబితాలో చోటు సంపాదించింది. కాలిఫోర్నియాలో నివాసముంటున్న రేష్మ కొసరాజు 12 ఏళ్ల వయసులో తాను ఒక రోజు తన పాఠశాలకు వెళ్లిన సమయంలో 200 మైళ్ల దూరంలో అడవిలో చేలరేగిన అగ్ని కీలలతో దట్టమైన పొగ ఏర్పడింది. అది రేష్మ ఉండే స్కూలు వరకు వ్యాపించింది. ఆ సమయంలో విద్యార్ధులు మాస్కులు పెట్టుకున్నా కూడా పొగ వల్ల ఇబ్బంది పడాల్సి వచ్చింది. జీవితంలో ఎన్నడూ అలాంటి సమస్య చూడని రేష్మకు ఆ సంఘటన తీవ్రంగా ఆలోచింపచేసింది.

తాను ఎదుర్కొన్న సమస్యకు పరిష్కారం కనిపెట్టాలని భావించింది. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అడవిలో అగ్ని ప్రమాదాలు ఏ స్థాయిలో అంచనా వేసే టెక్నాలజీని కనిపెట్టింది. రేష్మ కొసరాజు కనిపెట్టిన టెక్నాలజీ 90 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుందని నిపుణులు తేల్చారు. రేష్మ కొసరాజు కనిపెట్టిన టెక్నాలజీ భవిష్యత్తులో అడవిలో చేలరేగే అగ్ని కీలలను గుర్తించి తక్షణమే వాటిని అదుపు చేసేందుకు సహకరిస్తుందని టైమ్స్ పేర్కొంది. ఈ విధంగా రేష్మ కొసరాజు పర్యావరణానికి ఎంతో మేలు చేసిందని టైమ్స్ ప్రశంసించింది.

బ్యాటరీ రీసైక్లింగ్‌తో శ్రీ నిహాల్ తమ్మన ముందడుగు:-

బ్యాటరీ రీసైక్లింగ్‌తో పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్న తెలుగు విద్యార్ధి శ్రీనిహాల్‌ తమ్మన టైమ్స్ కిడ్ హీరోస్ ఫర్ ది ప్లానెట్ జాబితాలో స్థానం సంపాదించాడు శ్రీనిహాల్ తమ్మన. 10 ఏళ్ల వయస్సులోనే పర్యావరణ మేలు కోసం ఆలోచించాడు. కాలం చెల్లిన బ్యాటరీలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం కలుగుతుంది అనే దాని గురించి చదివిన శ్రీ నిహాల్  పర్యావరణ మేలు కోసం నడుంబిగించాడు.

మనం ఇళ్లలో వాడే బ్యాటరీలను చెత్తలో పడేయటం వల్ల అవి పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగించడతో పాటు ప్రజల ఆరోగ్యంపై  కూడా ప్రభావం చూపుతున్నాయనే విషయాన్ని అందరికి అవగాహన కల్పిస్తున్నాడు. వివరిస్తున్నాడు.  ఈ సమస్యను పరిష్కారించడానికి శ్రీ నిహాల్ బ్యాటరీ రీ సైక్లింగ్ కోసం తన వంతు కృషి  ప్రారంభించాడు. బ్యాటరీల వల్ల వచ్చేఅనర్థాలను, ప్రమాదాలపై అవగాహన కల్పించి పనికిరాని బ్యాటరీలను కాలం చెల్లిన బ్యాటరీలను సేకరించి వాటిని తిరిగి రీసైక్లింగ్ సెంటర్స్ కు పంపిస్తున్నాడు.

రీసైకిల్ మై బ్యాటరీ పేరుతో శ్రీనిహాల్ తొలుత తన స్నేహితులతో ఓ టీం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వెబ్ సైట్ ఏర్పాటు చేసి రీసైకిల్ మై బ్యాటరీ అనే దానిని ప్రచారం చేశాడు. దీంతో  ప్రపంచవ్యాప్తంగా  250 మంది విద్యార్థి వాలంటీర్లు శ్రీనిహాల్‌తో కలిసి పనిచేస్తున్నారు. 2,60,000 బ్యాటరీలు ఇప్పటివరకు శ్రీ నిహాల్ తన టీమ్ సాయంతో రీ సైకిలింగ్ చేశారు. ఇప్పటికే శ్రీ నిహాల్‌కు ఎన్నో పర్యావరణ పురస్కారాలు లభించాయి. అమెరికన్ టెలివిజన్ ఛానల్ సీఎన్ఎన్ రియల్ హీరో పేరుతో సత్కరించింది. యంగ్ హీరోలకు ఇచ్చే బారన్ ప్రైజ్ కూడా శ్రీనిహాల్ సొంతమైంది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected