Connect with us

News

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ప్రవాసులు భేటీ @ Hyderabad, India

Published

on

ఉత్తర అమెరికా లోని ఇద్దరు ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనుముల (Revanth Reddy Anumula) ను కలిశారు. తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో ఈ భేటీ జరిగింది. వీరు ఇంతకు మునుపు రేవంత్ రెడ్డి అమెరికా వచ్చినప్పుడు కూడా కలిశారు.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America) ఉమ్మడి కోశాధికారి సునీల్ పాంట్ర మరియు డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (Detroit Telugu Association) అధ్యక్షులు కిరణ్ దుగ్గిరాల ఈ వారాంతం హైదరాబాద్ లోని రేవంత్ రెడ్డి గృహంలో కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం తో రేవంత్ రెడ్డి కి క్రుతజ్ఞతలు తెలిపారు.

ఇండియా పర్యటనలో ఉన్న సునీల్ పాంట్ర (Sunil Pantra) మరియు కిరణ్ దుగ్గిరాల (Kiran Duggirala) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనుముల పై అభిమానంతో మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిసింది. సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటూ ఎన్నారైలకు (NRI) అపాయింట్మెంట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ని ప్రవాసులు అభినందిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected