Connect with us

Competitions

Telugu NRI Radio వారి సంక్రాంతి స్పెషల్ ముత్యాల ముగ్గుల పోటీ

Published

on

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు మహిళలందరికీ సంక్రాంతి పండగ సందర్భంగా సువర్ణ అవకాశం. తెలుగువారి గుండె చప్పుడు తెలుగు NRI రేడియో (Telugu NRI Radio) నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గు కాంటెస్టులో పాల్గొని, ఎన్నో ఆకర్షణీయమైన బహుమతులు గెలుపొందండి.

ఈ పోటీలో ముత్యాల్లాంటి ముగ్గులు వేసి గెలుపొందిన వారికి మొదటి ప్రైజ్ ఐ ఫోన్ 15, రెండవ ప్రైజ్ శాంసంగ్ 5 జి ఫోన్, మూడవ ప్రైజ్ లేటెస్ట్ ఒప్పో 5జి ఫోన్ లను అందివ్వ‌బోతున్నారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు మీరు చేయాల్సిందల్లా సంక్రాంతి (Pongal Festival) రోజున మీ ఇంటిముందు ముగ్గు వేసి, దాని పక్కన తెలుగు ఎన్నారై రేడియో – 2024 (తెలుగువారి గుండె చప్పుడు) అని రాసి, ఫోటో తీసి వాట్సాప్ నెంబర్ +91 8125974330 కు పంపండి.

ముత్యాల ముగ్గు పోటీ చివరి తేదీ 18/01/2024. ముగ్గు ప్రక్కన తెలుగు NRI రేడియో – 2024 (తెలుగు వారి గుండె చప్పుడు) అని రాయకపోతే అవి చెల్లవు. అద్భుతముగా ముగ్గు వేసే నైపుణ్యం ఉన్న మహిళలకు కూడా ఈ పోటీ వివరాలు షేర్ చేయండి. సంక్రాంతి పండగ రోజు విలువైన బహుమతులు పొందండి.

యాసలు వేరైనా భాష ఒక్కటే
దేశాలు వేరైనా రేడియో ఒక్కటే
అదే తెలుగు NRI రేడియో.
తెలుగు NRI రేడియో (Telugu NRI Radio) యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకుని, 24 గంటలు వీనులవిందైన సంగీతాన్ని ఆస్వాదించండి.

error: NRI2NRI.COM copyright content is protected