Connect with us

Competitions

సంక్రాంతి పండగ సందర్భంగా తెలుగు NRI రేడియో ముత్యాల ముగ్గుల పోటీలు

Published

on

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న మహిళలందరికీ సంక్రాంతి పండగ సందర్భంగా సువర్ణ అవకాశం! తెలుగువారి గుండె చప్పుడు తెలుగు NRI రేడియో నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గుల పోటీలలో పాల్గొనండి, ఆకర్షణీయమైన బహుమతులు గెలుపొందండి. ఈ పోటీలకి NRI2NRI.COM మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. అంద‌మైన ముత్యాల ముగ్గులు వేసి గెలుపొందిన వారికి క్రింది బహుమతులను అందిస్తారు.

మొదటి బహుమతి: లక్ష విలువ గల గోల్డ్ పెండెంట్, స్పాన్సర్డ్ బై మాయ జువెల్లర్స్. www.maayafinejewels.com
రెండవ
బహుమతి: శాంసంగ్ 5 జి ఫోన్
మూడవ
బహుమతి: లేటెస్ట్ ఒప్పో 5జి ఫోన్

దీనికి మీరు చేయాల్సిందల్లా సంక్రాంతి రోజున మీ ఇంటి ముందు ముగ్గు వేసి, దాని పక్కన తెలుగు ఎన్నారై రేడియో – 2023 (తెలుగువారి గుండె చప్పుడు) అని రాసి ఫోటో తీసి వాట్సాప్ నెంబర్ +919849410062 కి పంపండి. ముత్యాలముగ్గు పోటీ చివరి తేదీ జనవరి 17, 2023. ముగ్గు ప్రక్కన తెలుగు NRI రేడియో – 2023 (తెలుగు వారి గుండె చప్పుడు) అని రాయకపోతే అవి చెల్లవు.

యాసలు వేరైనా భాష ఒక్కటే
దేశాలు వేరైనా రేడియో ఒక్కటే
అదే తెలుగు NRI రేడియో
తెలుగు NRI రేడియో యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి. 24 గంటలు వీనుల విందైన సంగీతాన్ని ఆస్వాదించండి.

మీ కుటుంబంలో, మీ వాట్సాప్ గ్రూప్ లో, మీ ఊరిలో ఎవరో ఒకరికి అద్భుతముగా ముగ్గు వేసే నైపుణ్యం ఉండవచ్చు. వాళ్లకు కూడా ఇది షేర్ చేయండి. సంక్రాంతి పండగ రోజు లక్ష రూపాల విలువగల డైమండ్ లాకెట్ మరియు స్మార్ట్ ఫోన్స్ మీ కుటుంబ సభ్యులవే కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షేర్ చేయండి. సలహాలు, సూచనలు పంపాలంటే లేదా మీరు కూడా రేడియో వ్యాఖ్యాత (RJ – రేడియో జాకీ) కావాల‌నుకుంటే [email protected] కి ఈమెయిల్ చేయండి. మరిన్ని వివరాలకు www.telugunriradio.com ని సంప్రదించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected