పొద్దు పొడవక ముందే..
నింగిలోని తారలను భువికి చేర్చి..
చూడచక్కగా చుక్కలను పేర్చి..
తన చల్లని చేతులతో ముత్యాల ముగ్గును ముస్తాబు చేసెను..
ఇంటి వాకిటకే కళను తెచ్చే ముత్యాల ముగ్గాయే!
అలాంటి ముచ్చటైన ఆ ముగ్గులను మీ ముందు ఆవిష్కరిస్తోంది Telugu NRI Radio. 2025 సంక్రాంతి పండగ (Sankranti Festival) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ తెలుగు NRI రేడియో సందర్భంగా నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీకి వచ్చిన స్పందన అనూహ్యం. తెలుగు NRI రేడియో 2025 ముత్యాల ముగ్గుల పోటీ అనగానే వేలాది మంది తెలుగింటి ఆడపడుచులు తమ ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి ఫోటో తీసి పంపించారు.
ప్రతి ముగ్గు చూడచక్కగా ఉంది. ముంగిట్లో ముత్యాలు పోసినట్టు వేసి పంపించిన మహిళలందరిని అభినందిస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్‌గా తెలుగింటి ఆడపడుచు అక్షర మౌతాం (Akshara Moutam) ఎంపికైంది. సెకండ్ ప్రైజ్ కి రేణుక జోడు (Renuka Jodu) ఎంపికయ్యారు. థర్డ్ ప్రైజ్ కి మంగ పాచిక (Manga Pachika) ఎంపికయ్యారు. అందరూ తెలుగు ప్రజల ముఖ్య పండగ సంక్రాంతిని ప్రతిబింభించేలా ముగ్గులు వేశారు.
అందమైన ముత్యాల ముగ్గులు వేసి ఫస్ట్ ప్రైజ్‌గా లేటెస్ట్ Samsung Phone 5G స్మార్ట్ ఫోన్, 2nd ప్రైజ్ లేటెస్ట్ Oppo ఫోన్ 5G స్మార్ట్ ఫోన్, 3rd ప్రైజ్ లేటెస్ట్ Vivo 5G స్మార్ట్ ఫోన్ లను గెలుపొందిన మహిళలకు అందివ్వబోతున్నారు. అంతేకాదు ఈ ఏడాది 1 స్పెషల్ కన్సోలేషన్ బహుమతి 4th (Consolation Prize) రమాదేవి బోణీ (Ramadevi Boini) గారికి 5 వేల రూపాయాలు ఇస్తున్నారు.
మహిళామణులు ముగ్గు వేసి ఫోటో తీసి పంపిన ప్రతి ముగ్గు అద్భుతమే. ఇక గెలుపొందని మహిళలకు కూడా వచ్చే ఏడాది ముత్యాల ముగ్గుల పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. Telugu NRI Radio 2025 ముత్యాల ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు, స్పాన్సర్స్‌కి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.