NRI2NRI.COM: ఎన్నారై2ఎన్నారై.కామ్ పాఠకులందరికి ఉగాది పండుగశుభాకాంక్షలు. తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది మన తెలుగు (Telugu) వాళ్ళు జరుపుకొనే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ. సంస్కృతంలో యుగ అంటే తరం, ఆది అంటే ప్రారంభం. మొత్తంగా యుగాది లేదా ఉగాది (Ugadi) అంటే కొత్త తరం లేదా కొత్త యుగం ప్రారంభం అని అర్ధం.
శిశిర ఋతువు నుంచి వసంత ఋతువులో అడుగిడిన ఈవేళ బ్రహ్మ సృష్టిని ఆరంభం చేసినట్లుగా కూడా వేదాలు చెబుతున్నాయి. చైత్ర మాసం శుద్ధ పాడ్యమి నాడు జరుపుకొనే ఈ ఉగాది పండుగ (Ugadi Festival) మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది.సాధారణంగా తమ ఇలవేల్పును పూజిస్తారు. గుమ్మాలకి పచ్చని తోరణాలు కట్టడం, పంచాంగ శ్రవణం గావిస్తూ తమ రాసి ఫలాలలో భాగంగా ఆదాయం, ఖర్చు, రాజపూజ్యం, అవమానాలు తదితర విషయాలను తెలుసుకొని జాగ్రత్తవహించడం జరుగుతుంది.
తీపి, చేదు, వగరు, పులుపు, ఉప్పు, కారం లాంటి షడ్రుచులతో చేసిన ఉగాది (Ugadi) పచ్చడి సేవించడం ఒక గొప్ప అనుభూతి. మీ అందరూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, పిల్ల పాపలతో ఆనంద డోలికల మధ్య కలకాలం జీవించాలని ఆకాంక్షిస్తూ NRI2NRI.COM తరపున మరొక్కసారి తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు.