Connect with us

Cultural

ఆనందానుభూతులను పంచిన TLCA ఉగాది & శ్రీరామ నవమి వేడుకలు @ New York

Published

on

న్యూ యార్క్ (New York) లోని తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (TLCA) వారి ఉగాది మరియు శ్రీరామ నవమి వేడుకలు ఆనందానుభూతులను కలిగించింది. టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ (Nikhil Siddhartha) ఈ హౌస్ఫుల్ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

గత వారాంతం ఏప్రిల్ 20 శనివారం రోజున టిఎల్‌సిఎ అధ్యక్షులు కిరణ్‌ రెడ్డి పర్వతాల (Kiran Reddy Parvathala) మరియు ఛైర్మన్ రాజి కుంచం (Raji Kuncham) ఆధ్వర్యంలో స్థానిక హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా (The Hindu Temple Society of North America) ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (Telugu Literary & Cultural Association) 2024 ఉగాది మరియు శ్రీరామ నవమి వేడుకలకు డా. పైళ్ల మల్లారెడ్డి, డా. పూర్ణ అట్లూరి మరియు కృష్ణ మద్దిపట్ల గోల్డ్ స్పాన్సర్స్ గా వ్యవహరించారు. సుమారు 700 మందికి పైగా ఈ వేడుకలకు హాజరయ్యారు.

ముందుగా అందరికీ స్వాగతం పలికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, తెలుగు సినిమా పాటలు, పండుగ భోజనం అందరినీ ఆకట్టుకున్నాయి. పురోహితులు పంచాంగ శ్రవణం గావించగా అందరూ తమ రాసుల ప్రకారం శుభాశుభ ఫలాలు ఆసక్తిగా విన్నారు.

అన్నిటికంటే బాల రామాయణం ప్రదర్శన హైలైట్. అమెరికాలో పుట్టి పెరిగిన చిన్నారులు వాల్మీకి రామాయణాన్ని ప్రదర్శించిన తీరు అమోఘం. టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్స్ శ్రీకాంత్, శృతి తో కూడిన ప్రముఖ సంగీత దర్శకులు ఆర్ పి పట్నాయక్ (RP Patnaik) సంగీత విభావరి వినసొంపుగా సాగింది. ఈ సందర్భంగా స్పాన్సర్స్ ని మరియు అతిథులను సత్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హీరో నిఖిల్ అందరిని వేదికపైకి ఆహ్వానించి తన హ్యాపీ డేస్ (Happy Days) సినిమాలోని పాటతో, డాన్స్ తో అలరించారు. డిజిటల్ స్క్రీన్, ఫోటో బూత్ మంచి రిచ్ లుక్ ని తీసుకొచ్చాయి. యాంకర్ సాహిత్య వింజమూరి సమయానుసందర్భ వ్యాఖ్యానంతో నవ్వులు పూయించారు.

ప్రతి సంవత్సరం లానే తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) సావనీర్ ని విడుదల చేశారు. ముందుగా సాధన మల్లారెడ్డి ఆవిష్కరించి, వేదికపైనున్న అతిథులందరికీ తలా ఒక ప్రతిని అందించారు. మద్దిపట్ల ఫౌండేషన్ వారు రాఫుల్ బహుమతులు అందించారు. చివరిగా వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected