Connect with us

Events

బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టికల్లీ & ఫైనల్లీ TLCA బ్లాక్ బస్టర్ పొంగల్ ఈవెంట్ @ New York

Published

on

New York: పది మంది కలసి చేసుకుంటే ఇంట్లో పండుగ. వందమంది కలసి చేసుకుంటే వీధిలో పండుగ. వందల మంది కలిసి చేసుకుంటే ఊరంతా పండుగ. ఇలా ఊరంతా కలసి చేసుకున్నదే ఈసారి తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం TLCA సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ ఈ దశాబ్దపు హైలైట్ గా నిలిచిందంటే దానికి అందరి ప్రేమాభిమానాలే కారణం అంటున్నారు TLCA అధ్యక్షులు సుమంత్ రాంశెట్టి.

న్యూయార్క్ (New York) లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (Telugu Literary & Cultural Association – TLCA) జనవరి 25న స్థానిక హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా లో సంక్రాంతి సంబరాలు మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు వందల మంది నడుమ కోలాహలంగా నిర్వహించారు. పండుగ శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని ప్రారంభించి అందరినీ ఆహ్వానించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు ఆసాంతం లోకల్ టాలెంట్ ని రిఫ్లెక్ట్ చేశాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ (Anee Master) డాన్స్ వర్క్ షాప్ నిర్వహించి ఈ సంక్రాంతి సంబరాలలో పాదం కలిపి నర్తించి అలరించారు. టాలీవుడ్ (Tollywood) గాయని హారిక నారాయణ్ మరియు గాయకులు & యువ సంగీత దర్శకులు అనుదీప్ దేవ్ (Anudeep Dev) తమ గాత్రంతో అందరినీ కట్టిపడేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 800 మంది ప్రవాసులు TLCA భోగ భాగ్యాల సంక్రాంతి సంబరాలు మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడం విశేషం. గాయని హారిక నారాయణ్ (Harika Narayan) నిర్వహించిన సింగింగ్ వర్క్ షాప్ (Singing Workshop) యువ గాయనీ గాయకులను ప్రోత్సహించడంలో తోడ్పడింది.

జబర్దస్త్ ఫేమ్ అవినాష్ (Jabardasth Avinash) జనాల మధ్యలోకెళ్ళి మరీ నవ్వులు పూయించారు. ర్యాఫుల్ బహుమతులు (Raffle Prizes), సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారులకు భోగి పళ్ళు, గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకలలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం మరియు పండుగ ప్రత్యేక భోజనం అందరినీ ఆకట్టుకున్నాయి.

వంటలు, ముగ్గులు, గాలిపటాల పోటీలలో (Competitions) గెలిచిన వారికి వేదికపై బహుమతులు (Prizes) అందించారు. అతిథులను, స్పాన్సర్లను, ఆర్టిస్ట్స్ అందరినీ శాలువా, మెమెంటో తో ఘనంగా సన్మానించారు. మొట్టమొదటిసారి సంక్రాంతి సంచిక అంటూ కొత్తగా విడుదల చేశారు.

TLCA 2025 ఎగ్జిక్యూటివ్ కమిటీ (Executive Committee) సభ్యులను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (Board of Trustees) ని వేదికపైకి ఆహ్వానించి సభికులకు పరిచయం చేశారు. ఫోటోబూత్ (Photo Booth) వద్ద అందరూ ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా కనిపించారు. వివిధ రకాల వ్యాపారులు ఏర్పాటు చేసిన షాపింగ్ స్టాల్ల్స్ (Shopping Stalls) వద్ద మహిళలు కలియతిరిగారు. మధ్యమధ్యలో ర్యాఫుల్ (Raffle) డ్రాస్ తీసి మద్దిపట్ల ఫౌండేషన్ వారు సమర్పించిన బహుమతులు అందజేశారు.

ఈ సంక్రాంతి ఈవెంట్(Sankranti Event) ఇంత ఘనంగా చేసుకోవడానికి కారణమైన అందరికీ పేరుపేరునా హృదయ పూర్వక కృతఙ్ఞతలు. ముఖ్యoగా TLCA సభ్యులకు, తల్లిద్రండులకు, పిల్లలకు, మరీ ముఖ్యoగా దాతలకు, కళాకారులకు, స్నేహితులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు TLCA అధ్యక్షులు సుమంత్ రాంశెట్టి (Sumanth Ramsetti).

ఇలాగే భవిష్యత్తులో కూడా టి.ఎల్.సి.ఏ (TLCA) కార్యక్రమాలకు మీ ప్రేమాభిమానాలు అందిస్తారని ఆసిస్తున్నాను. ఈ కార్యక్రమాలు ఇంత ఘనంగా జరగడానికి కారణమైన మీ ఆందరి తోడ్పాటు, ఆదరాభిమానాలతో పాటు ఆత్మీయ దాతలు శ్రీ డా. పైళ్ళ మల్లారెడ్డి (Dr, Pailla Malla Reddy) గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు అన్నారు.

అలాగే కృష్ణ మద్దిపట్ల, డా. రాఘవరావు పోలవరపు, శ్రీ జయశేఖర్ తాళ్ళూరి (Jay Talluri), డా. పూర్ణ అట్లూరి గార్లకు, టి.ఎల్.సి.ఏ బోర్డ్‌ అధ్యక్షులు శ్రీమతి ‌ రాజి కుంచెం గారు, డాక్టర్ కృష్ణా రెడ్డి గుజవర్తి గారు, నెహ్రూ చెరుకుపల్లి గారు, ఇతర బోర్డు సభ్యులు, సహచర సభ్యులు అందరికీ హృదయపూర్వక ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

టాలీవుడ్‌ (Tollywood) ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ అనీ మాస్టర్‌, ప్రముఖ గాయని హారిక నారాయణ్‌, గాయకుడు & యువ సంగీత దర్శకుడు అనుదీప్‌ దేవ్, జబర్దస్త్ ఫేమ్ అవినాష్ కు, అలాగే మన లోకల్ ఫేమ్, టాలెంటెడ్ దర్శకులు, కళాకారులు శ్రీమతి సాధన పరాంజీ, ఉమా పుటాని, హంసిని కుంబ్లే గారికి మరియు వారి టీమ్ కు ఇలా ఎందరో కళాకారులు అందరికీ కృతఙ్ఞతలు తెలియజేశారు.

దీంతో 2025 సంవత్సరంలో తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (Telugu Literary & Cultural Association – TLCA) నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో మొట్టమొదటి కార్యక్రమం బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టికల్లీ & ఫైనల్లీ బ్లాక్ బస్టర్ విజయం సాధించినట్లైంది. అందరూ ఉత్సాహభరితంగా పాల్గొనేలా ఆహ్లాదకరమైన ఏర్పాట్లు చేసిన TLCA కార్యవర్గాన్ని అభినందించాల్సిందే.

చివరిగా స్పాన్సర్స్, ప్రేక్షకులు, వాలంటీర్లు, టెంపుల్, మీడియా పార్ట్నర్స్, టీవీ ఛానెల్స్ ఇలా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాభినందనలు తెలిపి సంక్రాంతి (Sankranti Festival) మరియు భారత గణతంత్ర దినోత్సవ (India Republic Day) వేడుకలను దిగ్విజయంగా ముగించారు.

న్యూయార్క్ (New York) లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (Telugu Literary & Cultural Association – TLCA) సంక్రాంతి సంబరాలు మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి విభిన్నమైన మరిన్ని ఫోటోల కోసం www.NRI2NRI.com/TLCA 2025 Sankranti and Republic Day Celebrations ని సందర్శించండి.

error: NRI2NRI.COM copyright content is protected