Connect with us

Events

జనవరి 21న TLCA సంక్రాంతి & గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు

Published

on

న్యూయార్క్ లోని తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (TLCA) 2023 కి గానూ నూతన కార్యవర్గం ఈ మధ్యనే ఎన్నికైన సంగతి తెలిసిందే. నెహ్రూ కఠారు (Nehru Kataru) అధ్యక్షతన మొట్టమొదటి ఈవెంట్ ‘సంక్రాంతి & గణతంత్ర దినోత్సవ వేడుకలు’ ఈ నెల 21 శనివారం రోజున నిర్వహిస్తున్నారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ (Satya Master), సింగర్స్ మొదుమూడి శృతిరంజని & అరుణ్ ముసునూరి మరియు యాక్ట్రెస్ అశు రెడ్డి (Ashu Reddy) ఆహ్వానితులను అలరించనున్నారు. న్యూయార్క్, ఫ్లషింగ్ నగరంలోని స్థానిక హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా ఈ కార్యక్రమానికి వేదిక.

Nehru Kataru
TLCA President

2023

తెలుగువారికి ఎంతో ముఖ్యమైన సంక్రాంతి పండుగని పురస్కరించుకొని జనవరి 21న నిర్వహించే ఈ వేడుకల్లో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు, తెలుగు సినీ పాటలు, నృత్యాలు, గాలిపటాల పోటీలు, భోగి పళ్ళు, పసందైన విందు భోజనం హైలైట్స్ గా నిలవనున్నాయి.

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (Telugu Literary & Cultural Association) వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ ద్వారా డాన్స్ నేర్చుకొని ప్రదర్శన చేసే సువర్ణ అవకాశం వయస్సుతో సంబంధం లేకుండా మీకు కల్పిస్తున్నారు.

కావున కల్చరల్ టీం (Cultural Team) సుమంత్ రాంశెట్టి, కిరణ్ పర్వతాల మరియు దివ్య దొమ్మరాజు ల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొనాలనుకునేవారు త్వరగా వారిని సంప్రదించండి. మరిన్ని వివరాలకు పై ఫ్లయర్స్ చూడండి.

భారత గణతంత్ర దినోత్సవ (Republic Day) థీమ్ తో చిన్నారుల ప్రత్యేక ప్రదర్శనలు దేశభక్తిని పెంపొందించేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఎప్పటిలానే మద్దిపట్ల ఫౌండేషన్ (Maddipatla Foundation) వారు ర్యాఫుల్ బహుమతులు అందించనున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected