న్యూయార్క్‌లో సంక్రాంతి వేడుకలను తెలుగువారు వైభవంగా జరుపుకున్నారు. తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (Telugu Literary and Cultural Association – TLCA) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు సుమారు 700 మంది ప్రవాసులు హాజరయ్యారు. ఎంతోమంది ప్రముఖులు తరలివచ్చి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
జనవరి 27వ తేదీన న్యూయార్క్‌లోని ఫ్లషింగ్‌లో ఉన్న హిందూ టెంపుల్ లో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. టిఎల్‌సిఎ అధ్యక్షులు కిరణ్ రెడ్డి పర్వతాల (Kiran Reddy Parvathala), వైస్ ప్రెసిడెంట్ సుమంత్ రామ్ సెట్టి (Sumanth Ramsetti), సెక్రటరీ మాధవి కోరుకొండ, ట్రెజరర్ శ్రీనివాస్ సనిగెపల్లి, జాయింట్ సెక్రటరీ అరుంధతి అడుప, జాయింట్ ట్రెజరర్ భగవాన్ నడింపల్లి తదితరుల ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి వేడుకలను నిర్వహించారు.
ఈ Telugu Literary and Cultural Association కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టిటిఎ (TTA) వ్యవస్థాపక నాయకుడు డా. పైళ్ళ మల్లారెడ్డి తోపాటు డా. పూర్ణ అట్లూరి, కృష్ణ మద్దిపట్ల, డా. ప్రసాద్ అంకినీడు, TLCA బోర్డ్ చైర్ పర్సన్ రాజి కుంచెం (Raji Kuncham), బోర్డ్ కార్యదర్శి రావు వోలేటి, బోర్డ్ కోశాధికారి తిరుమలరావు తిపిర్నేని, వెంకటేష్ ముత్యాల, కృష్ణారెడ్డి గుజవర్తి తదితరులు హాజరయ్యారు.
సంక్రాంతి కార్యక్రమాలతోపాటు భారత 75వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ (Republic Day Celebrations) కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యూయార్క్ లోని భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ (Binaya Srikanta Pradhan) మరియు న్యూయార్క్ (New York) స్టేట్ సెనేటర్ కెవిన్ థామస్ (Kevin Thomas) హాజరయ్యారు.
ఈ సందర్భంగా వేదికపై జెండా వందనం (Flag Hoisting) గావించారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs), ముచ్చట గొలిపే నృత్యాలు, తెలుగు సినీ పాటలు, విందు భోజనం, భోగి పళ్ళు, గాలిపటాల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి.
టాలీవుడ్ (Tollywood) కొరియో గ్రాఫర్ రఘు మాస్టర్, గాయనీ గాయకులు పృథ్వీ చంద్ర, సమీర భరద్వాజ్, ఆర్.జె హేమంత్, మరో కొరియోగ్రాఫర్ మహేశ్వరి తదితరులు ఈ వేడుకల్లో హైలైట్‌గా నిలిచారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలిచినవారికి మద్దిపట్ల ఫౌండేషన్ (Maddipatla Foundation) వారు గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ అందించారు.
ఈ TLCA సంక్రాంతి & గణతంత్ర వేడుకలను విజయవంతం చేసిన వారందరికీ TLCA అధ్యక్షులు కిరణ్ రెడ్డి పర్వతాల (Kiran Reddy Parvathala) అభినందనలు తెలియజేశారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సునీల్ చల్లగుల్ల, కరుణ ఇంజపూరి, దివ్య దొమ్మరాజు, లావణ్య అట్లూరి, సుధారాణి మన్నవ, ప్రవీణ్ కరణం తదితరులు కూడా ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.