Hong Kong: తెలుగు భాషా దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జరుపుకుంటారు. ఈ రోజును గిడుగు రామమూర్తి జయంతిగా జరుపుకుంటూ, తెలుగు భాష వికాసానికి ప్రధాన కారకుడైన గిడుగు రామమూర్తికి ఇది ఘన నివాళి. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తాయి.
గిడుగు రామమూర్తి పంతులు గారు తెలుగు భాషపై చేసిన కృషిని గురించి కొన్ని ముఖ్యాంశాలు
వ్యావహారిక భాషా ఉద్యమం: గిడుగు రామమూర్తి పంతులు గారు తెలుగు భాషలో వ్యావహారిక భాషా ఉద్యమానికి పితామహులుగా పిలువబడతారు.
ముఖ్య రచనలు
-“తెలుగు వ్యాకరణ విమర్శ” – తెలుగు భాషలో గ్రాంథిక, వ్యావహారిక భేదాలపై విశ్లేషణ
-“ఆంధ్ర పండిత భిషక్కులు” – తెలుగు భాషా సంస్కరణపై వ్యాసం
-“సరళ వ్యావహారిక భాషా ప్రయోగం” – వ్యావహారిక భాష ఆవశ్యకతపై వివరణ
ముఖ్య సిద్ధాంతాలు
“మాట్లాడే భాషే రాయాలి, రాసే భాషే మాట్లాడాలి”
“భాష ప్రజల కోసం, ప్రజల భాషే అసలైన భాష”
“గ్రాంథిక భాష కాకుండా వ్యావహారిక భాష విద్యాబోధనకు ఉపయోగపడుతుంది”
భాషా సంస్కరణలు
-పాఠశాలల్లో వ్యావహారిక భాష బోధనకు కృషి
-తేలికైన తెలుగు భాషా ప్రయోగాన్ని ప్రోత్సహించడం
-తెలుగు భాషలో ఉన్న క్లిష్టమైన పదజాలాన్ని సరళీకరించడం
ఆయన రాసిన ముఖ్య పుస్తకాలు
-“సమాజిక భాషా శాస్త్రము”
-“ఆంధ్ర భాషాభివృద్ధి”
-“వ్యావహారిక భాషా వాదము”
-“నూతన వ్యాకరణము”
గిడుగు వారి ఆలోచనలు
-భాష ప్రజల అవసరాలను బట్టి మారుతుంది
-భాష సజీవమైనది, నిరంతరం పరిణామం చెందుతుంది
-సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషే ఉత్తమమైన భాష
-విద్యాబోధన సులభతరం కావాలంటే వ్యావహారిక భాష అవసరం
ఈనాటికీ గిడుగు వారి భాషా సిద్ధాంతాలు తెలుగు భాషా అభివృద్ధికి మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. ఆయన చూపిన బాట తెలుగు భాషా వికాసానికి ఎంతగానో తోడ్పడింది.
ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (The Hong Kong Telugu Samakhya- THKTS) గిడుగు రామమూర్తి పుట్టిన రోజును తెలుగు సాంస్కృతిక ఉత్సవంగా (Telugu Cultural Festival) జరుపుకుంది. గిడుగు సేవలను తెలుపుతూ, తెలుగు భాషను నేర్చుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను స్థాపక సభ్యురాలు జయ పీసపాటి (Jaya Peesapaty) వివరించారు. ఈ సందర్భంగా పిల్లలు తెలుగు భాష, సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రదర్శిస్తు క్లాసికల్, సెమి క్లాసికల్, జానపద మరియు టాలివుడ్ పాటలు – నృత్యాలను ఘనంగా ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో కవితలు, కథా విన్యాసాలు కూడా నిర్వహించారు. పిల్లలకు చిత్రకళా పోటీలు కూడా నిర్వహించారు. వార్షికంగా, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (The Hong Kong Telugu Samakhya- THKTS) ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పిల్లలని – వారి అభిరుచుల్ని, కళలను ప్రోత్సహించడాన్ని సమర్థిస్తున్నామని, దాదాపు రెండు దశాబ్దాలుగా వారాంతంలో తెలుగు తరగతులు నిర్వహిస్తున్నామని, తమ సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించిన తమ కార్యవర్గ సభ్యులకు జయ పీసపాటి (Jaya Peesapaty) ధన్యవాదాలు తెలుపుతు, పిల్లలని వారి తల్లిదండ్రిని అభినందిస్తూ భాష నేర్చుకోవడంలో ముందడుగు వేయడానికి ఉత్సాహం చూపిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.