Connect with us

Language

Qatar: ఆంధ్ర కళా వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

Published

on

ఆంధ్ర కళా వేదిక ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “తెలుగు భాషా దినోత్సవం” కార్యక్రమం, ఈ ఏడాది కూడా 29 ఆగష్టు 2023 మంగళవారం నాడు వ్యావహారిక బాషా పితామహుడు శ్రీ గిడుగు రామ్మూర్తి గారి 160వ జయంతిని పురస్కరించుకొని ఎంతో వైవిధ్యంగా, ఆసక్తికరంగా మరియు ఘనంగా నిర్వహించారు.

ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు శ్రీ వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఖతార్ (Qatar) లో ప్రప్రధమంగా మరియు ఉచితంగా తెలుగు బాషా తరగతుల నిర్వహణ, తెలుగు బాషా దినోత్సవం మరియు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వంటి కార్యక్రమాల నిర్వహణ కేవలం ఆంధ్ర కళా వేదిక ద్వారా మాత్రమే జరుగుతున్నందుకు చాల ఆనందంగానూ మరియు గర్వంగానూ ఉందని అన్నారు.

వైవిధ్యమైన కార్యక్రమాలకు పేరుగాంచిన ఆంధ్ర కళా వేదిక ఈసారి తెలుగు బాషా దినోత్సవ  కార్యక్రమాన్ని కూడా వైవిధ్యంగా నిర్వహించామని, ఖతార్ లోని భారతీయ పాఠశాలలు (DPS-మోడరన్ ఇండియన్ స్కూల్, DPS-Monarch ఇంటర్నేషనల్ స్కూల్, లొయోల ఇంటర్నేషనల్ స్కూల్, Greenwood ఇంటర్నేషనల్ స్కూల్ మరియు బిర్లా పబ్లిక్ స్కూల్) లలో తెలుగు బోధనాంశంగా మరియు పాఠ్యాంశంగా బోధిస్తున్న ఉపాధ్యాయులను మరియు ఆ పాఠశాలల యాజమాన్యాన్ని అభినందిస్తూ వారిని చిరు జ్ఞాపికతో సత్కరించటం చేశామని తెలిపారు. 

వారితో పాటుగా తమ సాహిత్య రచనలతో మరియు హాస్య కార్టూన్లతో తెలుగు వారందరినీ అలరిస్తూ మరియు చైతన్య పరుస్తున్న శ్రీ ప్రసాద్ ఇంద్రగంటి గారిని మరియు శ్రీ రవీంద్ర వానపల్లి గారిని కూడా అభినందిస్తూ వారిని జ్ఞాపికతో సత్కరించటం జరిగిందని అన్నారు.  తెలుగు భాష ఉనికిని కాపాడుతూ వారు అందిస్తున్న తోడ్పాటుకి మరియు సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.   

అన్ని పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు తెలుగు బాషపట్ల తమకున్న అభిమానాన్ని, వారి అభిప్రాయాలను పంచుకున్నారు.  ఇంతటి బాధ్యతాయుతమైన కార్యక్రమాన్ని అద్భుతంగా మరియు వైవిధ్యంగా నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని బహు ప్రశంసించారు.

ఈ Qatar Andhra Kala Vedika తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులు విక్రమ్ సుఖవాసి, శ్రీసుధ, శిరీషా రామ్, శేఖరం రావు మరియు గొట్టిపాటి రమణ కి అభినందనలు తెలియజేసి కార్యక్రమాన్ని ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected