Connect with us

News

TDP 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు @ Valley Forge National Historical Park, King of Prussia, Philadelphia

Published

on

Philadelphia, Pennsylvania: శతపురుషుడు శ్రీ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) గారు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) స్థాపించి 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెన్సిల్వేనియా (Pennsylvania) రాష్ట్రంలో, ఫిలడెల్ఫియా (Philadelphia) ప్రాంతంలోని వ్యాలీ ఫోర్జ్ నేషనల్ హిస్టారికల్ పార్క్ (Valley Forge National Historical Park) లోని చారిత్రాత్మక కట్టడం నేషనల్ మెమోరియల్ ఆర్చ్ (National Memorial Arch) ప్రాంగణంలో మార్చ్ 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుక పురస్కరించుకుని పలువురు రాష్ట్ర టీడీపీ (TDP) నాయకులు ఎన్టీఆర్ (NTR) సేవలను కొనియాడుతూ, నవ్యాంధ్ర నిర్మాత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు అన్నారు.

ఎందరో నాయకులకి స్ఫూర్తి ప్రదాత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారి అడుగుజాడల్లో మనమందరం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి అని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) గారి చిత్రపటానికి పూలదండేసి, కేక్ కట్ చేసి ఫిలడెల్ఫియా ఎన్నారై టీడీపీ (NRI TDP) సభ్యులు తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ వేడుకలో మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి (Kandula Narayana Reddy), ఆమదాలవలస శాసన సభ్యులు కూన రవికుమార్ (Koona Ravi Kumar), తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్ (Mallela Rajasekhar), ఫిలడెల్ఫియా (Philadelphia) ఎన్నారై టీడీపీ (NRI TDP) నాయకులు పాల్గొని జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు.

error: NRI2NRI.COM copyright content is protected