Connect with us

Cultural

Houston, Texas: అట్టహాసంగా తెలుగు సాంస్కృతిక సమితి సంక్రాంతి సంబరాలు

Published

on

జనవరి 27 వ తారీఖున హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (Houston Telugu Cultural Association) వారు నిర్వహించిన “సంక్రాంతి సంబరాలు” కార్యక్రమం శ్రీరాధాకృష్ణ మందిరంలో ఎంతో విజయవంతంగా, అద్భుతంగా జరిగింది. 1000 మందికి మించిన ప్రేక్షకులతో కిటకిటలాడిన సభాప్రాంగణం, మొత్తం హ్యూస్టన్ (Houston, Texas) మహా నగరమే తరలివచ్చిందా అన్న చందంగా కనుల పండుగగా కనబడింది.

తెలుగు సాంస్కృతిక సమితి కార్యనిర్వాహక సభ్యులు

అధ్యక్షురాలు : ఆశాజ్యోతి దేవకి గారు
జనరల్ సెక్రటరీ : మైథిలి చాగంటి గారు
ట్రెజరర్ : రవి గునిశెట్టి గారు,
కల్చరల్ సెక్రటరీ : స్నేహ రెడ్డి చిర్ర గారు
వెబ్ అండ్ కమ్యూనికేషన్స్ : రత్నాకర్ మోడేకృత్తి గారు
లిటరరీ కోఆర్డినేటర్ : రామకృష్ణ గొడవర్తి గారు
స్పెషల్ ప్రాజెక్ట్స్ ఇంఛార్జ్ : శ్రీనివాస్ నూతలపాటి గారు
ధర్మకర్తలు : శ్రీధర్ దాడి గారు, ఇందిర చెరువు గారు, శ్రవణ్ ఎర్ర గారు

ఈ కార్యక్రమం భారతదేశ, అమెరికా దేశ జాతీయ గీతాలతోనూ, “మీనాక్షి కళామందిర్” బృందం వారి పరమేశ్వరుని గురించి, విఘ్నేశ్వర స్వామి గురించిన సాంప్రదాయ నృత్యంతోనూ మొదలైనది. తరువాత, తెలుగు సాంస్కృతిక సమితి లోని భాగమైన “తెలుగుబడి” (KT Center) విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి గీతం చాలా భక్తితో పాడారు.

సంక్రాతి (Sankranti) వేడుకలలో ముఖ్యభాగమైన “బొమ్మల కొలువు”ను కార్యనిర్వాహక బృందం వారు ఏర్పాటు చేశారు. ఇది చూసి వచ్చిన వారందరూ ఎంతో ఆనందించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలకు ఈ బృందం వారు సాంప్రదాయ బద్ధంగా “భోగిపండ్లు” వేడుక జరిపారు. సాంప్రదాయక వస్త్రధారణ పోటీలు జరిపారు – అనగా పంచెకట్టు, చీరెకట్టు పోటీలు.

కొంతమంది పిల్లలు, పెద్దలు ఈ వస్త్రధారణ పోటీలో పాల్గొని అందరినీ సంతోషపెట్టారు. న్యాయ నిర్ణేతలుగా యామిని శెట్టి గారు , శ్రీధర్ దాడి గారు నిర్వహించారు. విజేతలుకి ట్రోఫీలు, మెడల్స్ ఇవ్వడం జరిగింది. “తెలుగుబడి” (Sugar Land Center) నుండి విద్యార్థినీ విద్యార్థులు శ్రీరాముని గురించి భక్తిగీతం పాడారు, పద్యాలుచెప్పారు.

ఇదేకాక, ఈ కేంద్రంలోని గురువు ఉషారంజని గారు మహాభారతంలోని ఒక సందర్భంలోని చిన్న కథను నాటికగా తయారుచేసి, ఇతర ఉపాధ్యాయుల మరియు తల్లిదండ్రుల సహాయంతో పిల్లలకు ఎంతో శిక్షణ ఇచ్చారు. విద్యార్థినీ విద్యార్థులందరూ ఈ నాటికను ఎంతో బాగా చేశారు. ప్రేక్షకులందరూ ఎంతో ఆనందించారు.

ఇంకా ఎంతోమంది పిల్లలు, పెద్దలు ఎన్నోసాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో (Cultural Programs) పాల్గొన్న ప్రతి ఒక్కరికి మెడల్స్, సర్టిఫికెట్స్ (Certificates) అందచేసారు తెలుగు సాంస్కృతిక సమితి సభ్యులు. వీటిలో ముఖ్యంగా “అంజలి సెంటర్” బృందంనుండి, “సూత్ర స్కూల్ ఆఫ్ ఆర్ట్స్” బృందంనుండి భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు; ఇంకా ఇతర బృందాలవారు సంగీత వాద్యాలు, పాటలు.

కొంతమంది పిల్లలు భగవద్గీత శ్లోకాలు భక్తితో అద్భుతంగా చెప్పారు. వచ్చిన వారందరూ ఇవి అన్నీ చూసీ, వినీ ఎంతో తన్మయత్వం చెందారు. తమకి ఎంతో ధనసహాయం చేస్తున్న వారిని, వ్యాపారవేత్తలను, ఎంతో సహాయం చేసిన, చేస్తున్న ఇతర తెలుగు సంస్థలను, ఈ సమితి గురించిన ప్రచారమునకు సహాయపడుతున్నవారిని, Biryani Pot పండగ భోజనం అందించిన వారిని, వాలంటీర్స్ ని – అందరినీ ఈ సమితి వారు పేరుపేరునా వేదిక మీదకు ఆహ్వానించి, గౌరవించి, కృతజ్ఞతాభివందనం చేశారు.

పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్ఛేసిన Judge Julie Mathew, Judge KP George మరియు సంఘ సేవకుడు Taral Patel గార్లను సత్కరించారు. Houston Telugu Cultural Association సంస్థ ఎలక్షన్ కమిటీ సభ్యులైన సుధేష్ పిల్లుట్ల గారు, బంగార్ రెడ్డి గారు మరియు ఆంజనేయులు కోనేరు గారు వచ్చి ఈ సమితి యొక్క “కార్యనిర్వాహక బృందం” యొక్క ఎన్నికల ఫలితాల గురించి ప్రసంగించారు.

ప్రస్తుత కార్యనిర్వాహక బృందం వారు వీరిని శాలువాలతో సత్కరించారు. ఈ Houston Telugu Cultural Association కార్యనిర్వాహక బృందం కి రమ్య గుండ గారు (Ramya Gunda), యాదగిరి రెడ్డి కుడుముల (Yadagiri Reddy Kudumula) గారు, కావ్య రెడ్డి (Kavya Reddy) గారు ఎన్నిక అయినారు. ట్రస్టీ గా రాజ్ పసల (Raj Pasala) గారు ఎన్నిక అయినారు. ఇక చివరగా తెలుగుసాంస్కృతిక సమితి అధ్యక్షురాలు ఆశాజ్యోతి దేవకి (Asajyothi Devaki) గారు ప్రసంగించారు.

ఈ సంవత్సరం Houston Telugu Cultural Association అధ్యక్షురాలుగా వ్యవహరించడం ఆనందదాయకంగా ఉంది అని, తల్లి తండ్రులని (శంకర రావు గారు, సుకన్య గారు), భర్త (హరి ఇమ్మడి గారు) మరియు శ్రేయోభిలాషులని ప్రశంసించడం జరిగింది. ఆ తరువాత సుమంత్ బొర్రా & బృందం వారి సంగీత కార్యక్రమంతో ఈ “సంక్రాతి సంబరాలు” కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి అయినది.

వివిధ రకాలైన వెండర్ బూత్స్, జియాన్న జువెలర్స్, తనిష్క్ జువెలర్స్ దుకాణాలు పెట్టారు. ప్రేక్షకులు అందరు ఎంతో ఆసక్తితో కొనుగోలు చేసారు. ఈ Houston Telugu Cultural Association కార్యక్రమం చూడటానికి వచ్చి కార్యనిర్వాహక బృందం అందరికీ ఎంతో ప్రేరణ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected