Connect with us

News

Dallas, Texas: సతీష్ బండారు అధ్యక్షునిగా TANTEX నూతన కార్యవర్గం ఏర్పాటు

Published

on

తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు ఎల్లప్పుడూ పట్టం కట్టే ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాoటెక్స్) వారు 2024 సంవత్సరానికి  ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 7 వ తేదీన డాలస్ (Dallas) లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశం లో ప్రకటించారు. ఈ సందర్బంగా సతీష్ బండారు సంస్థ అధ్యక్షుడుగా పదవీబాధ్యతలు స్వీకరించారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) లాంటి గొప్ప సంస్థ కి  అధ్యక్షుడుగా పదవీబాధ్యతలు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఉత్తర అమెరికా లోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాoటెక్స్) ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినoదుకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాoటెక్స్)  సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

TANTEX (Telugu Association of North Texas) సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా నూతన కార్యక్రమాలను ఈ సంవత్సరం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఇందుకు కార్య నిర్వాహక బృందము మరియు పాలక మండలి పూర్తి సహకారాన్ని ఆశిస్తున్నానని సతీష్ బండారు (Satish Bandaru) తెలియజేసారు.

అధికారిక కార్యనిర్వాహక బృందం

అధ్యక్షుడు : సతీష్ బండారుసంయుక్త కార్యదర్శి : ఉదయ్ కిరణ్ నిడిగంటి
ఉత్తరాధ్యక్షుడు: చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటికోశాధికారి:  ప్రవీణ్ బాలిరెడ్డి
ఉపాధ్యక్షులు : మాధవి లోకిరెడ్డిసంయుక్త కోశాధికారి:  దీప్తి సూర్యదేవర
కార్యదర్శి :  సునీల్ సూరపరాజుతక్షణ పూర్వాధ్యక్షులు: శరత్ రెడ్డి ఎర్రం

రఘునాథ రెడ్డి కుమ్మెత, కళ్యాణి తాడిమేటి, స్రవంతి యర్రమనేని, శ్రీనివాసులు బసాబత్తిన, శ్రీనివాస పాతపాటి, రాజా మాగంటి, కృష్ణా రెడ్డి మాడ, లక్ష్మినరసింహ పోపూరి, చైతన్యరెడ్డి గాదె, శాంతి నూతి, దీపికా రెడ్డి, లక్ష్మి ఎన్‌ కోయ, అర్పిత రెడ్డి.

పాలక మండలి బృందం

అధిపతి : సురేష్ మండువ, ఉపాధిపతి : హరి సింగం

డాక్టర్ కొండా తిరుమల రెడ్డి, శ్రీకాంత్ పోలవరపు, డాక్టర్ శ్రీనాధ్ వట్టం, దయాకర్ మాడ, వీర లెనిన్ తాళ్లూరి.

కొత్త పాలక మండలి మరియు కార్యవర్గ బృందాల సూచనలు, సహాయ సహకారాలతో, సరికొత్త ఆలోచనలతో 2024 లో అందరిని అలరించే మంచి కార్యక్రమాలు చేయనున్నామని, స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ ఉంటాయని ఆశిస్తున్నానని  సంస్థ నూతన అధ్యక్షులు సతీష్ బండారు తెలిపారు.

2023 సంవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షుడుగా పని చేసి, పదవీ విరమణ చేస్తున్న తక్షణ పూర్వాధ్యక్షులు శరత్ రెడ్డి ఎర్రం (Sharath Reddy Yerram) మాట్లాడుతూ..  సతీష్ బండారు గారి నేతృత్వంలో ఏర్పడిన 2024 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు.

ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన సాక్షి, టీవీ 5, మన టి.వి, టీవీ 9 లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు. 2024 పాలక మండలి అధిపతి సురేష్ మండువ (Suresh Manduva) గారు మాట్లాడుతూ.. యువత భాగస్వామ్యాన్ని పెంచి TANTEX  ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలను నిర్వహించాలి అని సూచించారు.

అన్ని కార్యకలాపాలకు బోర్డు సహకారం మరియు మార్గదర్శకత్వం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఉపాధిపతి హరి సింగం గారు మొత్తం టీమ్‌ని అభినందించి Board of Trustees నుండి పూర్తి మద్దతు ఉంటుంది అని తెలియజేసారు. మరిన్ని వివరాలకు www.NRI2NRI.com/TANTEX ని  సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected