డాలస్/ఫోర్ట్ వర్త్: తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు ఎల్లప్పుడూ పట్టం కట్టే ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) వారు 2023 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 8వ తేదీన డాలస్ లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్బంగా శరత్ రెడ్డి ఎర్రం సంస్థ అధ్యక్షునిగా పదవీబాధ్యతలు స్వీకరించారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ లాంటి గొప్ప సంస్థ కి అధ్యక్షునిగా పదవీబాధ్యతలు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఉత్తర అమెరికా లోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాంటెక్స్ ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినoదుకు టాంటెక్స్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా నూతన కార్యక్రమాలను ఈ సంవత్సరం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఇందుకు కార్య నిర్వాహక బృందము మరియు పాలక మండలి పూర్తి సహకారాన్ని ఆశిస్తున్నానని తెలియజేశారు.
అధికారిక కార్యనిర్వాహక బృందం:- అధ్యక్షుడు : శరత్ రెడ్డి ఎర్రం సంయుక్త కార్యదర్శి : స్రవంతి యర్రమనేని ఉత్తరాధ్యక్షుడు : సతీష్ బండారు కోశాధికారి : రఘునాథ రెడ్డి కుమ్మెత ఉపాధ్యక్షులు : చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి సంయుక్త కోశాధికారి : రాజా మాగంటి కార్యదర్శి : మాధవి లోకిరెడ్డి తక్షణ పూర్వాధ్యక్షులు : ఉమామహేష్ పార్నపల్లి
సురేష్ పఠనేని, సుబ్బారెడ్డి కొండు, కళ్యాణి తాడిమేటి, ఉదయ్ కిరణ్ నిడిగంటి, శ్రీనివాసులు బసాబత్తిన, దీప్తి సూర్యదేవర, శాంతి నూతి, శ్రీనివాస పాతపాటి, కృష్ణా రెడ్డి మాడ, విజయ్ సునీల్ సూరపరాజు, లక్ష్మినరసింహ పోపూరి, రాజాప్రవీణ్ బాలిరెడ్డి, చైతన్య రెడ్డి గాదె.
పాలక మండలి బృందం:- అధిపతి : అనంత్ మల్లవరపు ఉపాధిపతి : డాక్టర్ భాస్కర్ రెడ్డి సానికొమ్ము గీతా దమ్మన్న, హరి సింగం, డాక్టర్ వెంకటసుబ్బరాయ చౌదరి ఆచంట, హరి సింగం, డాక్టర్ కొండా తిరుమల రెడ్డి, సురేష్ మండువ
Telugu Association of North Texas కొత్త పాలక మండలి మరియు కార్యవర్గ బృందాల సూచనలు, సహాయ సహకారాలు, సరికొత్త ఆలోచనలతో 2023 లో అందరిని అలరించే మంచి కార్యక్రమాలు చేయనున్నామని, స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ ఉంటాయని ఆశిస్తున్నానని సంస్థ నూతన అధ్యక్షులు శరత్ రెడ్డి ఎర్రం తెలిపారు.
2022 సంవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షుడుగా పని చేసి, పదవీ విరమణ చేస్తున్న తక్షణ పూర్వాధ్యక్షులు ఉమామహేష్ పార్నపల్లి మాట్లాడుతూ శరత్ రెడ్డి ఎర్రం గారి నేతృత్వంలో ఏర్పడిన 2023 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన సాక్షి, టీవీ 5, మన టి.వి, టీవీ 9, NRI2NRI.COM లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేశారు. మరిన్ని వివరాలకు www.tantex.org ని సందర్శించండి.