Connect with us

Agriculture

NTR వర్థంతి రోజున NTR జిల్లాలో పంచుమర్తి బ్రదర్స్ రైతులకు సహాయం: తానా రైతు కోసం

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) ఆధ్వర్యంలో రైతు కోసం తానా కార్యక్రమంలో భాగంగా 18వ తేదీన ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని గోకరాజు పల్లిలో తానా ఆధ్వర్యంలో రైతులకు పవర్ స్ప్రేయర్లు, టార్పలిన్ కవర్లను పంపిణీ చేశారు. తానా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ నాగ పంచుమర్తి (Naga Panchumarthi) ఆధ్వర్యంలో తన స్వగ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి డోనర్లుగా పంచుమర్తి బ్రదర్స్ (Panchumarthi Brothers) సంగమేశ్వరరావు పంచుమర్తి మురళీ కృష్ణ పంచుమర్తి, నాగమల్లేశ్వర రావు పంచుమర్తి వ్యవహరించారు. ఈ సందర్భంగా నాగ పంచుమర్తి మాట్లాడుతూ, రైతు బిడ్డగా, జన్మభూమిపై మమకారంతో తన స్వగ్రామం వాళ్ళకు ఏదైనా చేయాలన్న తలంపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.

అలాగే ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao – NTR) అభిమానిగా, ఆయన వర్థంతి రోజున ఆయనకు నివాళులు అర్పిస్తూ, తానా (TANA) నాయకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తానా కార్యదర్శి రాజా కసుకుర్తి, తానా రైతుకోసం కో ఆర్డినేటర్‌ రమణ అన్నె, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ నరేన్‌ కొడాలి (Naren Kodali) సహకరించారు.

తానా (Telugu Association of North America – TANA) కార్యదర్శి రాజా కసుకుర్తి గోకరాజుపల్లి (Gokarajupalli) కి తనవంతుగా గతంలోనూ, ఇప్పుడూనూ సహాయపడటంతోపాటు ఇతర విధాలుగా కూడా నిధులను సమకూర్చి ఈ రైతు పరికరాల పంపిణీ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూశారన్నారు.

గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన నాగ పంచుమర్తి తండ్రి రామకోటేశ్వరరావు కృషిని ఈ సందర్భంగా రాజా కసుకుర్తి (Raja Kasukurthi) ప్రశంసించారు. కాగా ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ నాగ పంచుమర్తి (Naga Panchumarthi) ధన్యవాదాలు తెలియజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected