Connect with us

Concert

ఏప్రిల్ 6న సహపంక్తి భోజనాలు & మ్యూజికల్ కాన్సర్ట్ @ TAMA ఉగాది ఉత్సవాలు: Atlanta, Georgia

Published

on

అట్లాంటా తెలుగు సంఘం TAMA ఉగాది ఉత్సవాలు ఏప్రిల్ 6 శనివారం రోజున నిర్వహిస్తున్నారు. కమ్మింగ్ నగరంలోని డెన్మార్క్ ఉన్నత పాఠశాల (Denmark High School, Alpharetta) లో నిర్వహించే ఈ ఉగాది ఉత్సవాలలో తామా సిగ్నేచర్ సహపంక్తి భోజనాలు ప్రత్యేకం. కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇండియా నుంచి ఫ్రెష్ గా తెప్పిస్తున్నారు.

ఈ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (Telugu Association of Metro Atlanta) ఈవెంట్లో పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, షాపింగ్ స్టాల్ల్స్, కిడ్స్ కి ప్రత్యేక పోటీలు, ర్యాఫుల్ బహుమతులు, మ్యూజికల్ కాన్సర్ట్ (Musical Concert) లతో ప్లాన్ చేస్తున్నారు. గాయనీ గాయకులు మాళవిక (Malavika), కారుణ్య (Karunya) మరియు యాంకర్ లావణ్య (Lavanya) అందరినీ అలరించనున్నారు.

టిక్కెట్స్ కొరకు WWW.NRI2NRI.COM/TAMA Ugadi 2024 వెబ్సైటుని సంప్రదించండి. హాట్ బ్రెడ్స్ రెస్టారెంట్ (Hot Breads) నుంచి పసందైన వంటకాలతో అందరికీ ఇండియాలో బంతి భోజనాలు తరహా వాతావరణం సృష్టించేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ (Early Bird Discount) మార్చి 31 వరకు మాత్రమే. కాబట్టి త్వరగా మీ టిక్కెట్స్ (Tickets) బుక్ చేసుకోండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected