Connect with us

Associations

అట్లాంటా తెలుగు సంఘం TAMA 2024 కార్యవర్గ & బోర్డు సభ్యుల వివరాలు

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) 2024 కార్యవర్గ సభ్యులు మరియు బోర్డు సభ్యులు ఛార్జ్ తీసుకున్నారు. తామా అధ్యక్షులు సురేష్ బండారు (Suresh Bandaru) సారధ్యంలోని కార్యవర్గ సభ్యులు మరియు తామా బోర్డు ఛైర్మన్ శ్రీనివాస్ ఉప్పు (Srinivas Uppu) సారధ్యంలోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అట్లాంటా వాసులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

43 వ సంవత్సరంలోకి అడుగెడిన ఈ అట్లాంటా తెలుగు సంఘం (TAMA) కార్యక్రమాలు జనవరి 20న ఆల్ఫారెటా (Alpharetta) లోని దేశాన మిడిల్ స్కూల్లో (Desana Middle School) సంక్రాంతి సంబరాలతో ప్రారంభం అవుతున్నాయి. 2023 కార్యవర్గం నుండి జనవరి 6 న 2024 కార్యవర్గం బాధ్యతలు స్వీకరించారు.

వీరి అందరి వివరాలు పైన ఫ్లయర్ లో చూడవచ్చు. మొత్తం 13 మంది సభ్యులున్న 2024 తామా (Telugu Association of Metro Atlanta) కార్యవర్గానికి, అలాగే 11 మంది సభ్యులున్న తామా బోర్డు (TAMA Board) కి NRI2NRI.COM నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected