Connect with us

Health

వైద్యో నారాయణ హరి – ఆగష్టు 13న ‘తామా’ ఉచిత క్లినిక్ 5కె వాక్ @ న్యూటౌన్ పార్కు

Published

on

వైద్యో నారాయణ హరి! వైద్యులు భగవంతునితో సమానం. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మను ఇస్తారు అంటారు పెద్దలు. మరి దేశం కాని దేశం అమెరికాలో ఏదో తమ పిల్లలను, మనవలు మానవరాళ్లను చూద్దామని వచ్చి ఆరోగ్య భీమా లేక ఒకవేళ ఉన్నా అర కొర కవరేజ్ తో ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటే ఎలా? అందుకే అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ వారు ఎన్నో ఏళ్లుగా ఉచిత క్లినిక్ నిర్వహిస్తున్నారు.

కోవిడ్ సమయంలోనూ ఉచిత క్లినిక్ ద్వారా ఇటు అమెరికాలో అటు ఇండియాలో సేవలందించారు. ఇప్పుడు ఇటు ఆరోగ్యపరంగా అటు ఫండ్స్ సేకరణ కోసం వచ్చే శనివారం ఆగష్టు 13 ఉదయం 8 గంటలకు జాన్స్ క్రీక్ లోని న్యూటౌన్ పార్కులో 5కె వాక్ నిర్వహిస్తున్నారు. రండి మనం కూడా తప్పకుండా పాల్గొని తామా ఉచిత క్లినిక్ సేవలో భాగమవుదాం. మరిన్ని వివరాలకు https://tama.org/walk ని సంప్రదించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected