Connect with us

Festivals

జనవరి 21న జాక్సన్విల్ తెలుగు సంఘం ‘తాజా’ సంక్రాంతి సంబరాలు

Published

on

జాక్సన్విల్ తెలుగు సంఘం ‘తాజా’ వారు ఈ వచ్చే శనివారం, జనవరి 21వ తారీఖున సంక్రాంతి సంబరాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సురేష్ మిట్టపల్లి అధ్యక్షతన మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమానికి జాక్సన్విల్ లోని స్థానిక బోల్స్ మిడిల్ స్కూల్ వేదిక కానుంది.

సంక్రాంతి సంబరాల సందర్భంగా ఫ్లోరిడా, జాక్సన్విల్ లోని తెలుగువారు అందరూ ఈ కార్యక్రమంలో కలుసుకునే విధంగా ప్రణాళిక రచించారు. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోనివారు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్విల్ ఏరియా (TAJA) కార్యవర్గ సభ్యులు.

తెలుగుదనంతో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు, సాంప్రదాయ దుస్తుల పోటీలు, పసందైన విందు భోజనం హైలైట్స్ గా నిలవనున్నాయి. RSVP చేయడానికి www.NRI2NRI.com/TAJAPongalEvent ని సందర్శించండి.

కళకళలాడే ఇళ్ల ముంగిట రంగవల్లులు, బసవన్నల ఆటపాటలు, మనకే సొంతమైన ఆచారాలు మీకు సంతోషాన్ని పెంచాలి ఈ సంక్రాంతి సందర్భంగా అంటూ, భోగి భోగ భాగ్యాలతో, సంక్రాంతి సిరి సంపదలతో, కనుమ కనువిందుగా జరుపుకోవాలని Telugu Association of Jacksonville Area వారు ఆశిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected