జాక్సన్విల్ తెలుగు సంఘం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్విల్ ఏరియా, 2022కి నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. 20వ వసంతంలోకి అడుగెడుతున్న జాక్సన్విల్ తెలుగు సంఘానికి అధ్యక్షులుగా సురేష్ మిట్టపల్లి ఎన్నికయ్యారు.
మిగతా కార్యవర్గ సభ్యుల్లో ఉపాధ్యక్షులుగా నాగ మల్లేశ్వర్ సత్తి, ప్రధాన కార్యదర్శిగా భవాని శొంఠి, కోశాధికారిగా శ్రీధర్ కండె, ఆపరేషన్స్ ఉపాధ్యక్షులుగా నారాయణ కాశిరెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా మహేష్ బచ్చు ఎన్నుకోబడ్డారు. అలాగే గత అధ్యక్షులు పాపారావు గుమ్మడపు పాస్ట్ ప్రెసిడెంట్ హోదాలో కొనసాగుతారు. సలహా మండలిలో లక్ష్మి సతీష్ కుమార్, నరసింగరావు వింజం మరియు పవన్ తిపిర్నేని ఉన్నారు. అలాగే జనరల్ కమిటీ, యూత్ కమిటీ లలో వివిధ సభ్యులు ఉన్నారు.
ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ “నా తోటి కార్యవర్గ మిత్రులందరికి అభినందనలు.భావితరాలను మన తెలుగు భాష, సంస్కృతులలో భాగస్వాములను చేయాలనే సత్సంకల్పంతో నిర్విరామంగా శ్రమిస్తున్న ‘తాజా’ సంఘం అధ్యక్షునిగా ఎన్నుకోబడడం సదవకాశంగా భావిస్తున్నాను. పూర్వ అధ్యక్షుల బాటలో నడుస్తూ 2022లో నూతన శక్తితో కూడిన మా కార్యవర్గం రానున్న రోజుల్లో సేవాకార్యక్రమాలు మరింతమంది తెలుగువారికి చేరేలా తోడ్పాటు అందిస్తామన్నారు”.