Connect with us

Cultural

వైభవంగా TAGKC ఉగాది వేడుకలు, నూతన కార్యవర్గ పరిచయం @ Kansas City

Published

on

అమెరికా లోని కాన్సాస్ నగరం (Kansas City) లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక Olathe North West High School లో ఇటీవల ఘనంగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. కార్యక్రమం TAGKC General Secretary మధు గంట స్వాగత ఉపన్యాసం తో ప్రారంభం అయింది.

ఈ కార్యక్రమంలో దాదాపు 650 మంది తెలుగు వారు (Telugu People) పాల్గొన్నారు. స్థానిక హిందూ ఆలయ పూజారి శ్రీ శ్రీనివాసాచారి గారి పంచాంగ శ్రవణం చేసిన తరువాత, చక్కని ప్రార్థనా గీతంతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. రఘు వేముల, చందన తియగూర మరియు శ్వేత అడుసుమిల్లి లు కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

మన తెలుగు సంప్రదాయాన్ని (Telugu Customs) సూచించే కూచిపూడి, భరత నాట్యం మరియు చక్కని జానపద, శాస్త్రీయ నృత్యాలు చిన్నవారు మరియు పెద్దలు చేసి వచ్చిన వారిని అలరించారు. వాటి తో పాటు ఈ మధ్య ప్రాచుర్యం పొందిన “కుర్చీ మడత పెట్టి, పల్సరు బండి” పాటలకు చిన్నారులు మరియు పెద్దవారు చేసిన నృత్యాలు ప్రేక్షకులకు ఉత్సాహం తెప్పించాయి.

ఈ వేడుకలో నూతన కార్యవర్గ సభ్యులను ఈ సంవత్సరం Telugu Association of Greater Kansas City (TAGKC) అద్యక్షుడు శ్రీ చంద్ర యక్కలి మరియు కొత్త Trust Members ని Trust chair శ్రీ శివ తియగూర గార్లు అందరికీ పరిచయం చేశారు. TAGKC అధ్యక్షుడు తన ప్రసంగంలో తెలుగు మాట్లాడే ప్రత్యేకతని, పిల్లలు మరియు పెద్దలు అంతా ఇంట్లో తెలుగులో మాట్లాడాలని సూచించారు.

Raffles లో గెలిచిన వారికి బహుమతులు అంద చేశారు. దాని తరువాత TAGKC ఉపాధ్యక్షులు శ్రీ శ్రావణి మేక చెప్పిన Vote of Thanks, జనగణమన లతో Cultural Programs ముగిశాయి. చివరగా చక్కని తెలుగు భోజనం అందరూ కలిసి చేసి Ugadi పండుగని ఆనందంగా చేసుకున్నారు.

ఈ కార్యక్రమానికి సహాయ పడ్డ కార్యకర్తలందరికీ, Sponsors కి, చక్కగా ఫోటోలు తీసిన శ్రీ కార్తీక్ కి, వీడియో తీసిన శ్రీ సూర్య లకు TAGKC (Telugu Association of Greater Kansas City) Executive Committee and Trust Board కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected