Kansas City: కాన్సాస్ సిటీ తెలుగు సంఘం ఆధ్వర్యం లో స్థానిక హిందూ దేవాలయం (Hindu Temple) లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగం గా ఆడవారికి ముగ్గుల పోటీలు, పిల్లలకు చదరంగం మరియు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.
పోటీలు జరుగుతున్నంత సేపు కళాకారులు అందరు మాతృదేశంలో తమ సంక్రాంతి (Sankranthi Festival) సంప్రదాయాలను సరదాగా నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి రేణుకా దేవి వేనుం వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Telugu Association of Greater Kansas City (TAGKC) సంక్రాంతి పోటీల్లో గెలిచిన వారికి శ్రీమతి దుర్గ తెల్ల, శ్రీమతి సుచరిత వాసం మరియు శ్రీమతి రాధిక గాదె గార్లు బహుమతులు అందచేశారు.
ఈ Telugu Association of Greater Kansas City (TAGKC) కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించిన సంఘం కార్యవర్గం సభ్యులకి, స్పాన్సర్స్ కి అధ్యక్షుడు మధు గంట (Madhu Ganta), ట్రస్ట్ బోర్డ్ కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి చేవూరు ధన్యవాదాలు తెలిపారు.