Kansas City, Missouri: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (Kansas City) ఆధ్వర్యం లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు స్థానిక హిందూ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ లో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది హాజరయ్యారు. దేవాలయ పూజారి గారి పూజ తో ఈ వేడుకలు ప్రారంభం అయ్యాయి.
మగువలు అందరు అందంగా అలంకరించిన బతుకమ్మ (Bathukamma) లను తీస్కుని వచ్చి తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ ఆటపాటలతో వీనులవిందుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. సాహిత్య వింజమూరి గారి వ్యాఖ్యానం అందరిని ఆకట్టుకుంది. చిన్నపిల్లలు కనులవిందైన కోలాటం తో అందరిని అలరించారు.
ఈ కార్యక్రమం లో బెస్ట్ బతుకమ్మ కాంపిటీషన్, బతుకమ్మ రీల్స్ కాంపిటీషన్, బతుకమ్మలు తీసుకొచ్చిన ఆడవారికి రాఫెల్ ప్రైజెస్, తెలుగు అసోసియేషన్ వారి పండుగ అలంకరణలు ప్రత్యేకంగా నిలిచాయి. వేడుకలు ముగిసిన తర్వాత తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (Telugu Association of Greater Kansas City) వారు కమ్మని విందుని అందించారు.
ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించిన కార్యవర్గ సభ్యులకి, స్వచ్ఛంద సేవకులకు, దాతలకు సంఘం అధ్యక్షురాలు శ్రావణి మేక (Shravani Meka), ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీనివాస్ పెనుగొండ ధన్యవాదాలు తెలిపారు.