Connect with us

Associations

సమాజసేవలో టిఎజిడివి అధ్యక్షురాలిగా రెండేళ్ళ అనుభవాలు: లలిత శెట్టి

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వ్యాలీ ‘టిఎజిడివి’ అధ్యక్షురాలిగా లలిత శెట్టి గత రెండు సంవత్సరాలుగా సేవలందించిన సంగతి అందరికీ తెలిసిందే. టిఎజిడివి తో తన రెండేళ్ళ అధ్యక్ష ప్రయాణం గురించి ఎన్నారై2ఎన్నారై.కామ్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ తన అనుభవాలను ఇలా పంచుకున్నారు.

“టిఎజిడివి 2020-22 కి అధ్యక్షురాలిగా పనిచేసే అవకాశం నాకు లభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పదవి ద్వారా మన తెలుగు భాష, సంస్కృతిని, సంప్రదాయాలను మనపిల్లలకు అమెరికన్ కమ్యూనిటీకి పరిచయం చేసే అవకాశం లభించింది. సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమందిని ఆదుకోవడం వల్ల కలిగిన సంతోషం నా జీవితంలో మరువలేనిది. అలాగే మరుగునపడిన ఎంతోమంది కళాకారుల ప్రతిభను వెలికితీసే అవకాశం కూడా నాకు ఈ అధ్యక్ష పదవి ద్వారా లభించింది. నా అధ్యక్ష పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఇచ్చిన సభ్యులు, మిత్రులు, దాతలు, శ్రేయోభిలాషులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

నేను పదవి చేపట్టిన సమయంలో ప్రపంచం మొత్తం కోవిడ్ మహమ్మారితో గజగజలాడుతోంది. ఆసమయంలో ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనిని సవాలుగా తీసుకుని సమాజానికి ఇలాంటి కష్టకాలంలోనే మనం అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతోపాటు కార్యక్రమాలను ఆన్ లైన్ ద్వారా చేయడంతోపాటు వివిధ కార్యక్రమాలు, పోటీలలో అందరినీ భాగస్వాములు చేస్తూ కార్యక్రమాలు నిర్వహించడం బావుంటుందన్న ఆలోచనను అందరితో చర్చించి ఆన్ లైన్ ద్వారా కార్యక్రమాలను నిర్వహించాము. ఆన్ లైన్ ద్వారా మేము చేసిన ప్రతి కార్యక్రమం అందరినీ ఎంతగానో అలరించింది. అలా ఎన్నో కార్యక్రమాలను టిఎజిడివి ద్వారా చేయడం జరిగింది. అన్నీ కార్యక్రమాలు అందరి సహకారంతో విజయవంతమయ్యాయి.

గత 2 సంవత్సరాలుగా మేము సమాజాన్ని ఆకట్టుకునేలా రెగ్యులర్ మరియు మరిన్ని ఆన్ లైన్ ప్రోగ్రామ్లను నిర్వహించాము. టిఎజిడివి సంప్రదాయానికి అనుగుణంగా దీపావళి, సంక్రాంతి మరియు ఉగాది పండుగలను సంప్రదాయబద్దంగా సభ్యులతో కలిసి జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ మైమరపింపజేశాయని ఎంతోమంది చెప్పడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ప్రముఖులు ఎందరినో అతిధులుగా ఆహ్వానించాము. శ్రీ గరికిపాటి నరసింహరావు గారు, మనో, ధనుంజయ్, మాళవిక, వరె వా చెఫ్ సంజయ్ తుమ్మ, అంజనా సౌమ్య, అనుదీప్, నేహా ఇంకా ఎంతోమంది ప్రముఖులను కార్యక్రమాలకు ఆహ్వానించి వారి ద్వారా సభ్యులకు అవసరమైన సందేశాలను, సంతోషాన్ని అందించాము. పల్లె సంక్రాతి పేరుతో సంక్రాంతి సంబరాలను నిర్వహించినప్పుడు సభ్యులందరికి గ్రామాల్లో ఎలాంటి వాతావరణంలో సంక్రాంతి పండుగలు జరుపుతారో అన్న విషయాన్ని తెలియజేయడం జరిగింది.

మహిళల కోసం ఎకో ఫ్రెండ్లీ వరలక్ష్మీ వ్రతం పోటీ, పిల్లలకు బయోడిగ్రేడబుల్ గణేశ పోటీ, జంటలకొసం గువ్వ గోరింక పొటీలను, పురుషుల కోసం నల భీమ వంటల పోటీలను నిర్వహించడం జరిగింది. ప్రకృతిపై అవగాహనకోసం ఫోటోగ్రఫీ పోటీని ఏర్పాటు చేశాము. అలాగే వృత్తిపరమైన వారికోసం, వారికి అవసరమైన ప్రొఫెషనల్ డెవలప్మెంట్ వెబినార్, స్టూడెంట్ల కోసం కాలేజీ ఫీజుల చెల్లింపు వంటి కార్యక్రమాలు, మగువ పేరుతో మహిళా సాధికారత కార్యక్రమం, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, మానసిక ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించడం జరిగింది.

సేవా కార్యక్రమాలను కూడా ఈ రెండేళ్ళ కాలంలో ముమ్మరంగా చేశాము. ఫుడ్ బ్యాంక్ కు 2500 డాలర్లు విరాళాలుగా సేకరించి అందించడం జరిగింది. ఇండియాలో కోవిడ్ సహాయ కార్యక్రమాలకోసం 4100 డాలర్లు సేకరించి ఇవ్వడం జరిగింది. టిఎజిడివి యూత్ కార్యకర్తలు మెయిన్ స్ట్రీట్లో ఉన్న మన్న ఫుడ్ బ్యాంక్ కు 5125 డాలర్లను విరాళంగా ఇచ్చారు. పిల్లలకోసం పర్ల్ ఎస్. బక్ ఇంటర్నేషనల్ కు 8545 డాలర్లు సేకరించి ఇచ్చారు.

మా సేవలు, కార్యక్రమాలు విజయవంతమయ్యాయంటే అదంతా మీ ప్రోత్సాహం, మీ మద్దతు లేకుండా సాధ్యం కాదు. మాకు ఎల్లవేళలా అండగా నిలిచిన అందరికీ, దాతలకు నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా గురువు సద్గురు కృపతో నేను నా పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగాను. నా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంలో నాకు సహకరించడంతోపాటు, అండగా నిలిచిన నా కుటుంబం మరియు స్నేహితులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా తల్లిదండ్రులు ముత్యాల రావు కిలారి మరియు సుశీల కిలారి, కుమార్తెలు కీర్తన శెట్టి, జైషీలా శెట్టి, నా భర్త నాగ శివరావు శెట్టి నిరంతరం నాకు అండగా నిలిచారు. మేము రూపొందించిన అన్ని ఆన్లైన్ వీడియోల వెనుక నాకు సహకరించిన నా మరదలు కళ్యాణి కిలారికి, నా ప్రియమైన స్నేహితులు లక్ష్మీ మందా మరియు రాధా గుంటూరికి ధన్యవాదాలు.

నా టీమ్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. టీమ్ సపోర్ట్ లేకుండా నేను ఈ విజయాన్ని సాధించలేను. ఎల్లప్పుడూ నా పక్షాన నిలిచి, కార్యక్రమాల విజయవంతానికి సహకరించిన నా టీమ్ లోని సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు. మా టీమ్ సభ్యుల వివరాలు క్రింద పేర్కొన్నాను.

అధ్యక్షురాలు: లలిత శెట్టి
వైస్ ప్రెసిడెంట్: ముజీబుర్ రెహ్మాన్ షేక్
కార్యదర్శి: రామ్మోహన్రావు తాళ్లూరి
కోశాధికారి: వెంకట్ సాకమూరి
జాయింట్ సెక్రటరీ: అరవింద్ పరుచూరి
జాయింట్ ట్రెజరర్: మధుసూదన్ బుడాటి
మెంబర్స్ ఎట్ లార్జ్: పార్ధసారధి మాదాల, సురేష్ బొందుగుల, రాధా గుంటూరి, హరీష్ అన్నాబత్తిన, రాజు కక్కెర్ల, శివ అనంతుని, సాయి సుదర్శన్, ప్రియాంక నూకవరపు మరియు శ్రీకాంత్ చుండూరు”

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected