Connect with us

Concert

నవంబర్ 20న చార్లెట్ తెలుగు సంఘం మెగా దసరా, దీపావళి సంబరాలు; గ్రాండ్ మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్

Published

on

చార్లెట్ తెలుగు సంఘం (Telugu Association of Greater Charlotte Area – TAGCA) వారు నవంబర్ 20వ తేది ఆదివారము మధ్యాహ్నం దసరా, దీపావళి సంబరాలను చార్లెట్ తెలుగు వారందరితో కలసి జరుపుకోవడానికి సమాయత్తమవుతున్నారు. చార్లెట్ లోని విలాసవంతమైన Knight Theater ఈ కార్యక్రమానికి వేదిక కానుంది.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ గాయనీగాయకులు మనో (Mano), గీతామాధురి (Geetha Madhuri), శ్రీకృష్ణ (Sri Krishna) మరియు ఇంకొంతమంది గాయనీ గాయకులతో మైమరపించే మెహర్ బ్యాండు (Mehar Live Band) తో మన నగరానికి వచ్చి మనల్ని అలరించడానికి విచ్చేస్తున్నారు. ఎన్నో మధుర గేయాలు, సరికొత్త హిట్స్ ని మనకందించబోతున్నారు.

అంతే కాదండోయ్! ప్రతి సంవత్సరం TAGCA జరిపించే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆ రోజు అలరించబోతున్నాయి. మన చార్లెట్ తెలుగు పిల్లలు, పెద్దలు ప్రత్యేక సాంస్కృతిక కర్యక్రమాలతో, వారి ఆట పాటలతో మనల్ని ఆకట్టుకోవడానికి సంసిద్ధమవుతున్నారు. ఆటపాటలే కాదండీ, వినోదాలతో పాటు సేవా దృక్పధం కూడా చాలా అవసరం. అందుకే మనం మన పిల్లలకి వారి చిన్నతనం నుండి మన సమయంలో కొంత స్వచ్చంధంగా గడపాలని నేర్పిన దానికి ప్రతిఫలంగా Presidential Awards తీసుకోవడానికి మన TAGCA దసరా దీపావళి కార్యక్రమం వేదిక కానుంది.

అంతే అనుకుంటున్నారా…లేదండీ మన ఆడవారికి ఇష్టమైన పట్టుకుంటే పట్టుచీర కూడా ఆ రోజు ఆకట్టుకోబోతోంది. పట్టూచీరంటే మామూలు పట్టు కాదండీ.. అసలైన కంచి పట్టు చీరలు మన మధ్యకు పట్టుకుంటే పట్టుచీర లో రాబోతున్నాయి. ఇంకా బంగారు కాసులు, వెండి కాసుల raffles కూడా ఇందులో భాగం. వనితా లోకం ఇష్టపడీ, మనసుపడే Shopping Corner కూడా ఆ రోజు మీ అందరి కోసం సిద్ధమవుతోంది. ఇంకా ఎన్నో మరెన్నో హంగులతో మన తెలుగువారి TAGCA వేదిక సిద్ధమవుతోదండీ.

TAGCA చార్లెట్ తెలుగు వాళ్ళ గుండె చప్పుడు…ఇంతింతై వటుడింతై అన్నట్లు 2006 వ సంవత్సరంలో ఒక చిన్న సంస్థగా మొదలై ఈ రోజు 2000 మంది సభ్యులతో ఒక వసుదైక కుటుంబంలా ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలతో అందరిని ఒక దగ్గర చేరుస్తూ ఆట పాటలతో అలరిస్తూ ముందుకు సాగిపోతోంది. TAGCA కార్యవర్గం మనందరి సంతోషం కోసం సరికొత్తగా మీ ముందుకు రావటానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది.

దీనిలో భాగంగా ఈ సంవత్సరం మన వసుదైక కుటుంబం మరో అడుగు ముందుకేసి మన చార్లెట్ వాసులతో సముద్ర విహారానికి సమాయత్తమవుతుంది. అంతే కాదండీ… మరెన్నో మంచి ఉపయోగకరమైన కార్యక్రమాలని మీ ముందుకు తీసుకురావడానికి TAGCA నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. TAGCA మీది, మనది మరి మనందరిది. మీరందరూ తప్పక విచ్చేసి మన TAGCA కుటుంబ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కార్యవర్గం ఆశిస్తోంది. టిక్కెట్లు కోసం www.NRI2NRI.com\TAGCADiwaliTickets క్లిక్ చేయండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected