న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) మరియు తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (TTA) అధ్వర్యంలో జూన్ 2 న లాంగ్ ఐలాండ్, న్యూయార్క్ లో 10వ తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు న్యూయార్క్ లోని తెలుగు సభ్యులు, ఇతర సంస్థల నేతలు హాజరై తెలంగాణ పాటలతో, మాటలతో తమ హర్షాతిరేకాలను తెలియజేసుకున్నారు. ప్రత్యేక అతిధి శ్రీ నారాయణస్వామి గారి సతీమణి శ్రీమతి విద్య గారు జయ జయహే తెలంగాణ గీతాన్ని మధురంగా ఆలపించి శుభారంభం చేశారు.
వ్యాఖ్యాతలు పద్మ తాడూరి, ప్రసన్న మదిర గార్లు నాటి సమావేశ ఉద్దేశాన్ని, తెలంగాణా ఆవిర్భావ దినం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ప్రత్యేక అతిథి ప్రముఖ తెలంగాణ రచయిత శ్రీ నారాయణస్వామి వెంకటయోగి, ఎన్వైటీటీఏ అధ్యక్షుడు సునీల్ రెడ్డి గడ్డం, టీటీఏ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి గగ్గెనపల్లి, వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ గూడూరు గార్లని వేదిక మీదికి ఆహ్వానించారు.
శ్రీ సునీల్ రెడ్డి గడ్డం గారు సభకి ఆహ్వానం పలుకుతూ ఈ రెండు సంఘాలు చేస్తున్న సామాజిక సేవని వివరించారు. ప్రత్యేక అతిధి శ్రీ నారాయణస్వామి గారు తమకు ఎంతో దూరం అయినా సభకి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సత్యనారాయణ రెడ్డి గగ్గెనపల్లి గారు ఆహూతులను ఆహ్వానిస్తూ, తెలంగాణ పోరాట సమయం లో తమ కాలేజీ అనుభవాలు వివరించారు.
అలాగే న్యూయార్క్ లో మిగతా సంఘాలతో కలిసి సమిష్టిగా పని చేస్తున్నామని అన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ గూడూరు గారు మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం అనేది తెలంగాణా వాసుల దశాబ్దాల ఆకాంక్ష అన్నారు. ఆ ఆకాంక్షకు సామాజిక, భాషా పరమైన, ఆర్ధిక వైవిధ్యాలు తొడయ్యాయి. దేశంలో చాలా రాష్ట్రాలు కూడా ఇలా విడిపోవడం జరిగింది, ఇది కాలగతిలో జరిగే సహజ పరిణామం అన్నారు.
శ్రీ వెంకటయోగి తమ ప్రసంగంలో అస్తిత్వం కోసం తెలంగాణ వాసులు చేసిన పోరు, మరియు తమ అనుభవాన్నీ వివరిస్తు, తెలంగాణ భాష యొక్క విశిష్టత, సరళత్వాన్ని, తెలంగాణ ప్రజలు నిత్యం పడ్డ కష్టాలని గుర్తు చేస్తూ, తెలంగాణ వచ్చాక రాష్ట్రం ఎంతో అభివృధ్ధి చెందింది అన్నారు. తెలుగు సినిమాలో పెరుగుతున్న తెలంగాణ భాష ప్రాముఖ్యత గురుంచి చెప్పిన విధానము అహుతులనీ అలరించింది.
అదే విదంగా తెలంగాణ పోరాటం సందర్భంగా ఎన్నారై తెలంగాణ వాసుల పాత్ర మరియు వారు చేపట్టిన వివిధ నిరసన కార్యక్రమాల, మొట్టమొదట బతుకమ్మ శకటం న్యూయార్క్ నగరం ఇండియాడే పరేడ్ లో ప్రదర్శించిన అనుభవాలు వివరించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
స్థానిక సంస్థల నేతలు టీఎల్ సీఏ తరుపున ఉపాధ్యక్షులు కిరణ్ పర్వతాల, తానా తరుపున సుమంత్ రామిశెట్టి, RVP దిలీప్ ముసునూరు ప్రసంగించారు. చక్కని విజ్ఞాన భరితమైన కార్యక్రమాన్ని అందించారని అభినందిస్తూ, తెలుగు వారంతా ఐక్యంగా ప్రగతికోసం ముండదుగులు వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు రవీందర్ కోడెల, టీటీఏ తరుపున BOD సహోదర్ పెద్దిరెడ్డి, Past-BOD శరత్ వేముగంటి, ఇంకా ఎన్ వైటీటీఏ వైస్ ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ, సెక్రెటరీ గీతా కంకణాల, EC సభ్యులు పద్మ తాడూరి, ప్రసన్న మధిర తదితరులు వారి యోక్క అనుభవాలు వివరించారు. సభ్యులు శ్రీ సుబ్బు గరికపాటి గారు తన యొక్క అనుభవాలను మరియు ముల్కి నిబందనల గురుంచి వివరించారు.
అనంతరం శ్రీ నారాయణస్వామి గారిని, వారి సతీమణి విద్య గారిని సత్కరించారు. ఆహూతులు కార్యక్రమ నిర్వాహకులకు, ఎన్నో తెలియని విషాయాలని అందించిన శ్రీ నారాయణస్వామి గారికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ఈ కార్య క్రామానికి, ఎన్వైటిటిఎ / టిటిఎ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అడ్వైజరీ కమిటీ మరియు ఇసి సభ్యులు తోపాటు, పిల్లలు, పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చివరగా చక్కని విందు భోజనం తో కార్యక్రమం ముగిసింది.