Connect with us

Associations

డల్లాస్ లో తెలంగాణ ప్రవాస రెడ్డీస్ సంస్థ ఏర్పాటు

Published

on

అమెరికాలో మరో సంఘం ఏర్పాటైంది. కాకపొతే ఈసారి ప్రాంతం, కులం సమ్మేళనంగా. సంఘం పేరు తెలంగాణ ఎన్నారై రెడ్డీస్. దీనికి డల్లాస్ నగరం వేదికైంది. అమెరికాలోని వివిధ రాష్ట్రాల తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రవాస రెడ్డి కులస్తులు యువత, మహిళలు, పిల్లలు గత శనివారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనెక్టింగ్ ది కమ్యూనిటీ అనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటుచేసినట్లు, తెలంగాణ ప్రాంతానికి చెందిన పేద రెడ్డి కులస్తులకు సహాయం చేస్తామని అలాగే ప్రవాస యువతీయువకుల వివాహలకు ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. అమెరికాలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సంస్థను విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రఘువీర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి బొర్రా, శ్రీనివాస్ రెడ్డి కేలం, చంద్ర రెడ్డి పోలీస్, సురేష్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి ఎక్కటి, అనిల్ రెడ్డి బోదిరెడ్డి తదితరులు నిర్వహించారు.

error: NRI2NRI.COM copyright content is protected