ఖతార్ లో నివసిస్తున్న తెలుగు కార్మికులలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు ప్రతియేటా క్రికెట్ పోటీలు (Cricket Tournament) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ సంవత్సరం నూతనంగా 5 జట్టుల ను ప్రోత్సహించడం జరిగింది. ఇట్టి పోటీలు గత 3 వారాలుగా జరుగుతున్నాయి.
మార్చ్ 8 శుక్రవారం నాడు ఫైనల్ మ్యాచ్ లో భగత్ సింగ్ తో తెలుగు వారియర్స్11 తలపడగా తెలుగు వారియర్స్ 11 (Telugu Warriors) రెండు వికెట్ల తేడా తో తెలంగాణ గల్ఫ్ సమితి TPL 9 ట్రోఫీ ని గెలిచింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భారత రాయబారి కార్యాలయంలో హెడ్ ఆఫ్ లెబర్ వెల్ఫేయిర్ ఇంచార్జ్ శ్రీ జయ గణేష్ గారు విచ్చేశారు.
జయ గణేష్ గారు మాట్లాడుతూ ఇలా మన తెలుగు వారికి క్రీడా స్ఫూర్తి పెంచుతూ ఒక్క చోట చేర్చడం చాలా సంతోషం గా ఉంది అని అన్నారు. గెస్ట్ ఆఫ్ హానర్ ICBF అధ్యక్షుడు శ్రీ శనవాస్ బావ గారు మాట్లాడుతూ TGS కార్మికుల కోసం నిరంతరం పని చేయడం గుర్తు చేస్తూ అభినందిచారు.
తెలుగు సంఘాల భీష్మ పితా శ్రీ కోడూరి శివప్రసాదరావు గారు మాట్లాడుతూ గల్ఫ్ సమితి అన్ని కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొనడం సంతోషాన్ని ఇస్తుందని గుర్తు చేశారు. ICBF ఉపాధ్యక్షుడు శ్రీ దీపక్ షెట్టి గారు, ICBF సెక్రెటరీ మహమ్మద్ కుని గారు, ICBF తెలుగు రెపర్సెంటివ్ శ్రీ శంకర్ గౌడ్ గారు, QPL ఫౌండేర్స్ సిరాజ్అన్సారీ, హంజత్, గులరాజ్, అన్వేర్ గార్లు హాజరు అయ్యి విజతలకు బహుమతులు అందజేయడం జరిగింది.
తెలంగాణ గల్ఫ్ సమితి (Telangana Gulf Samithi) కార్యవర్గంలో అధ్యక్షుడు మైదం మధు గారు ఉపాధ్యక్షుడు గడ్డి రాజు, వంశీ, గోలి, సాగర్, ఎల్లన్న, ఎల్లన్న T, శ్రీధర్, రాజేష్ పాల్గొనగా వచ్చిన అతిధులకు మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు.