Connect with us

News

Qatar: తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ పదేళ్ల పండుగ

Published

on

తెలంగాణ రాష్ట్ర పదేళ్ల పండుగని తెలంగాణ గల్ఫ్ సమితి (Telangana Gulf Samithi) వారు ఖతార్ (Qatar) దేశంలో ఘనంగా నిర్వహించారు. గత శుక్రవారం జూన్ 14 వ తేదీన తెలంగాణ (Telangana) గల్ఫ్ సమితి ఖతార్ వారి ఆధ్వర్యంలో లోయల ఇంటర్నేషనల్ స్కూల్ లో సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమాన్ని ప్రాంభించారు. ఇట్టి కార్యకమనికి ఖతార్ భారత రాయబారి శ్రీ విపుల్ గారు ముఖ్య అతిథిగా హాజరు కాగా, జానపద సింగర్ లావణ్య, సింగర్ అరుణ్ పాల్గొని వచ్చిన తెలుగు ప్రజలందరినీ అలరించారు.

మొదట కార్యక్రమాన్ని తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు శ్రీ మైదం మధు గారు ప్రారంభించి వచ్చిన అతిధులు ఆహ్వానం పలికారు. తెలంగాణ గల్ఫ్ సమితి ఫౌండర్ మెంబెర్ శంకర్ గౌడ్ (Shankar Goud) గారు తెలంగాణ (Telangana) గల్ఫ్ సమితి కతర్ లో చేస్తున్న సేవలను గుర్తు చేశారు. కార్యకమనికి అతిధులుగా విచ్చేసిన శ్రీ కోడూరి శివరామ ప్రసాద్ గారు మరియు క్రిష్ణా కుమారు గారు తెలంగాణ గల్ఫ్ సమితి చేస్తున్న సేవలను అభినందించారు.

ముఖ్య అతిధి శ్రీ విపుల్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడి 10 ఎళ్ల లోపు ఎంతో పోరోగతి సాధించిందని మరియు గల్ఫ్ సమితి బృందం ఎల్లపుడు అందుబాటులో ఉంటూ కార్మికులకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నందుకు కొనియాడారు. కార్యక్రమనికి ఐసీసీ అధ్యక్షుడు మణికంఠ, ఐసీబీఫ్ ఉపాధ్యక్షుడు దీపక్ షెట్టి, ఐసీసీ ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, ఐసీసీ జెనరల్ సెక్రెటరీ మోహన్ కుమార్, ఐసీసీ మహిళ విభాగం చైర్మన్ శ్రీమతి నందిని అబ్బాగౌని గారు, ఎస్ సి బి ఎఫ్ కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ కుని జరీనా ఆహాద్, కుల్విందర్ సింగ్ విచ్చేశారు.

అలాగే తోటి తెలుగు సంఘాల అధ్యక్షులు తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీమతి సుధా గారు తెలంగాణ (Telangana) ప్రజా సమితి అధ్యక్షులు తిరుపతి గారు ఆంధ్ర కళావేదిక అధ్యక్షులు వెంకప్ప గారు, తెలుగు కళా సమితి అధ్యక్షులు శ్రీ హరీష్ రెడ్డి గారు, ఆంధ్ర వెల్ఫేర్ అధ్యక్షులు నర్శింహ జోష్యుల గారు తెలుగు స్పోర్ట్స్ సెంటర్ అధ్యక్షులు శ్రీ అబ్బగోని శ్రీధర్ గారు మరియు తెలుగు సంఘాల నాయకులు ప్రత్యేకంగా తెలంగాణ గల్ఫ్ కార్మికులు దాదాపుగా 2000 మంది పైగా పాల్గొన్నారు.

దాదాపు 50 మంది సాంస్కృతిక కళాకారులు పాల్గొనగా తెలంగాణ గల్ఫ్ (Telangana) సమితి ప్రధాన కార్యదర్శి వంశీ గారు ముగింపు సందేశాన్ని ఇవ్వగా, గల్ఫ్ సమితి కార్యవర్గ సభ్యులు గడ్డి రాజు, సంధ్య, ప్రియ, మనోహర్, సాగర్, గోలి శ్రీనివాస్, సుధాకర్, మారుతి మరియు సలహాదారులు క్రిష్ణా గారు, ఎల్లన్న గారు, వెంకటేష్ గారు గత వారం రోజుల నుంచి కార్యక్రమన్నీ ముందుండి నడిపి విజయవంతం చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected