గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం జూన్ 5 న నిర్వహించనున్నారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ వారాంతం జూన్ 5 ఆదివారం రోజున డులూత్ లోని గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్ లో తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ పేరుతో పెద్ద ఎత్తున ఈ వేడుకలు నిర్వహించనున్నారు.
ఇండియన్ ఐడల్ ఫేమ్ రాక్ స్టార్ రేవంత్ ఆధ్వర్యంలో ఎం లైవ్ బ్యాండ్ తో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ వీనులవిందు చేయనుంది. అలాగే టాలీవుడ్ ప్రముఖ గాయని దామిని భట్ల, జానపద గాయనీ గాయకులు మౌనిక యాదవ్, లక్ష్మి దోస, నిత్య, జనార్దన్ పన్నెల మరియు మన టీవీ యాంకర్ లావణ్య గూడూరు అందరినీ అలరించడానికి సిద్ధమవుతున్నారు.
వీరితోపాటు జబర్దస్త్ ఫేమ్ హాస్యనటులు అదిరే అభి తన సిగ్నేచర్ మార్క్ హాస్యంతో అందరూ కడుపుబ్బా నవ్వుకునేలా స్కిట్స్ తో రెడీ అవుతున్నారు. అలాగే స్థానిక డాన్స్ మరియు మ్యూజిక్ స్కూల్స్ తెలంగాణా ప్రాభవాన్ని పెంపొందించేలా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.
ఈ వేడుకలకు ప్రత్యేక అతిధులుగా జాన్స్ క్రీక్ సిటీ మేయర్ జాన్ బ్రాడ్బెర్రి, ఫోర్సైత్ కౌంటీ షెరిఫ్ రాన్ ఫ్రీమన్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ దండెబోయిన, అలాగే జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ సభ్యులు బాబ్ ఎర్రమిల్లి మరియు దిలీప్ టుంకి హాజరవనున్నారు.
ఇంకా చిన్నారులకు తెలంగాణ ఆర్ట్ ఫెస్టివల్, మహిళలకు ప్రత్యేక షాపింగ్ స్టాల్ల్స్ ఇలా మరెన్నో ప్రత్యేకతలతో ఘనంగా నిర్వహించనున్న ఈ తెలంగాణ సాంస్కృతిక దినోత్సవానికి రెజిస్ట్రేషన్ తప్పనిసరి. ఏర్పాట్లలో ఏమాత్రం లోటుపాటు లేకుండా తగ్గేదేలే అన్నట్టు మిమ్మల్ని ఆహ్లాదపరచాలంటే వెంటనే Event Registration లో మీ పేరు నమోదు చేసుకోండి.
అలాగే చిన్నారుల తెలంగాణ ఆర్ట్ ఫెస్టివల్ కు Art Festival లో మరియు షాపింగ్ స్టాల్ల్స్ కొరకు Vendor Stalls లో రెజిస్టర్ చేసుకోండి. జూన్ 5 ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా అలరించనున్న ఈ వేడుకలలో తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా గేట్స్ కార్యవర్గ మరియు బోర్డు సభ్యులు కోరుతున్నారు.