Connect with us

Cultural

వైభవోపేతంగా TDF Portland Chapter బతుకమ్మ & దసరా ఉత్సవాలు

Published

on

తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (Telangana Development Forum) పోర్ట్లాండ్ సిటీ చాప్టర్ (Portland City Chapter) ఆధ్వర్యములో బతుకమ్మ మరియు దసరా పండుగల ఉత్సవాలు కన్నుల పండుగగా వైభవోపేతంగా జరిగాయి. Quatama Elementary School లో గత ఆదివారం జరిగిన ఈ వేడుకలని చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిచారు.

సద్దుల బతుకమ్మ రోజు అక్టోబర్ 22nd న ఘనంగా జరిగిన ఈ వేడుకలకి పోర్ట్లాండ్ మెట్రో సిటీస్ నుండి దాదాపు 450 పైగా పాల్గొని విజయవంతం చేసారు. ఈ వేడుకకి మహిళలు మరియు చిన్నారి అమ్మాయిలు తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టి పడేలా ముస్తాబై రంగుల బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆట పాటల తో సందడి చేసారు.

బతుకమ్మ (Bathukamma) నిమజ్జనం తర్వాత మహిళలు అందరు గౌరమ్మ మరియు ప్రసాదం ఇచ్చి పుచ్చుకున్నారు. దసరా ఉత్సవాన్ని షమీ స్తోత్రం అందరితో పఠింప చేసి జమ్మి చెట్టుకి పూజ చేసి జమ్మి (బంగారం) ఇచ్చి పుచ్చికొని అలయ్ భలాయ్ చేసికున్నారు. బతుకమ్మ మరియు రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ (TDF) టీం బహుమతులని అందచేశారు.

వేడుకలో పాల్గొన్న వారందరికీ రుచికరమైన భోజనం ని వడ్డించారు. ఈ వేడుకలలో పాల్గొన్న వారందరికీ శ్రీని అనుమాండ్ల (Srini Anumandla) బతుకమ్మ మరియు దసరా పండుగల శుభాకాంక్షలు తెలిపారు. పండుగలని వైభవోపేతంగా జరగడానికి సహకరించిన మహిళలకు అభినందనలు తెలిపారు.

ఈ వేడుకలని అత్యంత అంగ రంగ వైభవోపేతంగా జరిపి విజయవంతం అవటానికి కృషి చేసిన పోర్ట్లాండ్ చాప్టర్ టీం మరియు వాలంటీర్స్ – వీరేష్, సురేష్, రఘు.S, ప్రవీణ్.A, మధు, శ్రీపాద్, నరేందర్, జయ్, శ్రీకాంత్, అజయ్, శ్రీని. G, నవీన్, అరుణ్, ప్రదీప్, కార్తీక్, నిరంజన్, రఘు.B, రామేశ్వర్, శ్రీదత్త మరియు వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ప్రశంసలు తెలియ చేసారు.

ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించడానికి సహాయం చేసిన స్పాన్సర్స్ అందరికి శ్రీని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చివరగా వేడుకల్లో పాల్గొన్న పోర్ట్లాండ్ (Portland, Oregon) మెట్రో ఇండియన్ కమ్యూనిటికి, సహకారం చేసిన మిత్రులకి, శ్రేయలోభిలాషులకి అభినందనలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected