Connect with us

Bathukamma

Toronto, Canada: భక్తి శ్రద్ధలతో తెలంగాణ కెనడా అసోసియేషన్ బతుకమ్మ సంబరాలు

Published

on

Toronto, Canada: తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో టొరంటో-కెనడా నగరంలోని తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ (Bathukamma) సంబరాలను అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 2000కు పైగా తెలంగాణ వాసులు స్థానిక మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్, ఎటోబికో లో పాల్గొని బతుకమ్మ పండుగను విజయవంతం చేశారు.

ఈ సంవత్సరం విశేష స్పందనతో అనూహ్య విధంగా బతుకమ్మలను తీసుకువచ్చి టొరంటో (Toronto) తెలంగాణ ప్రజలు బతుకమ్మలపై వారికి ఉన్న భక్తిని చాటుకున్నారు మరియు పలు వంటకాలతో పాట్ లాక్ విందు భోజనం సమకూర్చారు. ఈ సందర్బంగా కమిటీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ సంబరాలపై వారికి ఉన్న భక్తిశ్రద్ధలను కొనియాడారు.

కెనడా (Canada) లో ఇంత ఘనంగా జరుగుతున్న తెలంగాణ ఉత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. అందరికి మధురానుభూతిని మిగిల్చాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉల్లాసంగా పాల్గొన్నారు.

తెలంగాణ కెనడా అసోసియేషన్ (Telangana Canada Association) అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ మా అసోసియేషన్ ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తు, బతుకమ్మ పండుగ విశిష్టతను గురించి చక్కగా వివరించారు. ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మూలంగా తెలంగాణ పండుగలని ప్రపంచానికి తెలియజేస్తున్నాం అన్నారు.

అలాగే సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకు వెళ్లడానికి దోహదం చేస్తాయి అని వ్యక్తీకరించారు. శ్రీ శ్రీనివాస్ మన్నెం (Srinivas Mannem) గారు ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవముతో’ అనే విధముగా తెలంగాణ కెనడా అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు.

ఈ సంవత్సరం బతుకమ్మలలో అత్యుత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి విజేతలకి తెలంగాణ కెనడా అసోసియేషన్ (Telangana Canada Association) మరియు విభూతి ఫ్యాబ్ స్టూడియోస్ వారు బహుమతులను అందజేశారు. బతుకమ్మ పండుగకి విచ్చేసిన వారికి రాఫెల్ డ్రా నిర్వహించి గెలిచిన వారికి ఒక గ్రాము బంగారం మరియు 1/2 ఔన్స్ వెండి బహుమతిగా అందజేయడం జరిగింది.

ఈ సంబరాలలో బతుకమ్మ ఆట సుమారు 4 గంటలు ఏకధాటిగా ఆట పాటలతో చివరగా పోయిరావమ్మ గౌరమ్మ పాటతో ఊరేగిపుంగా వెళ్లి నిమజ్జనం చేశారు. తరువాత సత్తుపిండి, నువ్వులపిండి, పల్లీలపిండి ప్రసాదం పంపిణి చేసారు. Telangana Canada Association (TCA) లోకల్ బిజినెస్ లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తు వస్తుంది.

ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. స్పాన్సర్లు, వాలంటీర్లు (Volunteers) మరియు కమ్యూనిటీ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని శ్రీ శ్రీనివాస్ మన్నెం కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు శ్రీ శంతన్ నేరళ్లపల్లి, కార్యదర్శి శ్రీ శంకర్ భరద్వాజ పోపూరి, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు, కోశాధికారి శ్రీ రాజేష్ అర్ర , సంయుక్త కోశాధికారి శ్రీ నాగేశ్వరరావు దలువాయి, డైరెక్టర్లు శ్రీ కోటేశ్వర్ చెటిపెల్లి, శ్రీ శరత్ యరమల్ల, శ్రీమతి శ్రీరంజని కందూరి,

శ్రీ ఆనంద్ తొంట ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ పవన్ కుమార్ పెనుమచ్చ, శ్రీ రాము బుధారపు, శ్రీమతి మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ సభ్యులు – శ్రీ అతిక్ పాషా, శ్రీ కోటేశ్వర రావు చిత్తలూరి, శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల, శ్రీ ప్రకాష్ చిట్యాల, శ్రీ అఖిలేష్ బెజ్జంకి, శ్రీ సంతోష్ గజవాడ,

శ్రీ కలీముద్దీన్ మొహమ్మద్, శ్రీ శ్రీనివాస తిరునగరి, శ్రీ రాజేశ్వర్ ఈధ, శ్రీ వేణుగోపాల్ రోకండ్ల, శ్రీ విజయ్ కుమార్ తిరుమలపురం మరియు శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి పాల్గొన్నారు. కార్యక్రమం చివర్లో అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తి చేసినందుకు సహకరించిన టొరంటో (Toronto, Canada) తెలుగు ప్రజల్ని అభినందించారు.

అంతేకాకుండా స్వచ్ఛంద సేవకులను, గవర్నింగ్ బోర్డ్ సహకారాలని ఎంతో కొనియాడారు. చివరగా తెలంగాణ కెనడా అసోసియేషన్ (Telangana Canada Association) స్పాన్సర్లకు మరియు డిన్నర్ పాట్ లాక్ స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.

error: NRI2NRI.COM copyright content is protected