తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే నినాదంతో 2015 లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) స్థాపించబడినది. తెలంగాణ తరుపున విదేశాలలో ఏర్పడిన మొట్టమొదటి సాంస్కృతిక సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association – TTA).
డా. పైళ్ల మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో 2015 లో మొదలై, ప్రస్తుత ప్రసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల (Vamshi Reddy Kancharakuntla) గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్న తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలుగు రాష్ట్రాలలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సేవ డేస్ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా నిర్వహించ తలపెట్టింది.
ఈ కార్యక్రమంలో విద్య ద్వారా ఉపాధి మార్గాలు, వ్యాపార వృద్ధితో ఆర్ధిక వనరుల అభివృద్ధి, ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక, జాబ్ ఓరియెంటెడ్, ఉపాధి కల్పన, యూత్, మహిళా సాధికారత (Women Empowerment) కోసం చేసే అవేర్నెస్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు . ఈ కార్యక్రమాలు ముఖ్యంగా తెలంగాణ అంతటా హైదరాబాద్, అచ్చంపేట, నల్గొండ దేవరకొండ, బోనగిరి, సిద్ధిపేట, వికారాబాద్, యాదగిరిగుట్ట లలో ఉంటాయని తెలిపారు.
ఈ నెల 10వ తేదినుండి 23వ తేదీ వరకు ఉన్న కార్యక్రమాలకు తెలంగాణ (Telangana) ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ప్రసిడెంట్ వంశీ రెడ్డి ప్రజలను కోరారు. ఈ నెల 10 వ తారీకున హైదరాబాద్ లో నిర్వహించే మెడికల్ క్యాంపు తో తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవా డేస్ (TTA Seva Days) కార్యక్రమాన్ని అంకురార్పణ చేయనుంది.
ప్రతి రోజూ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తెలంగాణ లోని వివిధ ప్రాంతాలలో నిర్వహించనున్నట్లు.. 12వ తేదీన T-HUBలో టెక్నాలజీ పై అవగాహనా కార్యక్రమం, 16 వ తేదీన నక్లెస్ రోడ్ లో 5K RUN హెల్త్ పై అవగాహనా కోసం నిర్వహిస్తున్నట్లు, 17న వికారాబాద్ లో కృత్రిమ అవయవాల పంపిణీ, 18 న వరంగల్ లో మెగా జాబ్ మేళా చివరగా 23 తేదీన రవీంద్రభారతిలో సేవాడేస్ ముగింపు కార్యక్రమం గ్రాండ్ ఫినాలే లో భాగంగా లైవ్ మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ శ్యామల (Anchor Syamala) మరియు సింగర్స్ సాకేత్, మధుప్రియ (Madhu Priya) తొపాటు వివిధ మిమిక్రి, జానపద కళాకారులతో జానపద, వెస్ట్రన్ నృత్యాలు మరియు గీతాలతో సభ అట్టహసంగా పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు, తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ మే 2024 న SEATTLE లో జరుగనున్న నేపథ్యములో ఈ కార్యక్రమాలను ముందుగా తెలంగాణ అంతటా నిర్వహించనున్నట్లు.. తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రసిడెంట్ కంచరకుంట్ల వంశీ రెడ్డి గారు తెలిపారు.
సేవా డేస్ కార్యక్రమానికి Advisory Council Chair Dr. Vijaypal reddy గారు, Co-Chair Dr. Mohan Patlolla గారు, Member Bharat Reddy Madadi గారు, కోఆర్డినేటర్ గా సురేష్ రెడ్డి వెంకన్నగారి గారు, ఇంటెర్నేషనల్ కోఆర్డినేటర్ గా డా. డి . ద్వారకనాథ రెడ్డి గారు, కో–కోర్డినేటర్ గా దుర్గా ప్రసాద్ సెలోజ్ గారు, ఫౌండేషన్ సర్వీస్ చైర్ గా సంతోష్ గంటారం గారు, ఇంటెర్నేషనల్ వైస్ ప్రసిడెంట్ గా ప్రసాద్ కునారపు గారు,హెల్త్ అండ్ వెల్నెస్ అడ్వైసర్ గా జ్యోతిరెడ్డి దూదిపల గారు, నర్సింహా పెరుక గారు – కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ గా, ప్రసిడెంట్ గా కంచరకుంట్ల వంశిరెడ్డి గారు మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ గా నవీన్ రెడ్డి మలిపెద్ది గారు భాద్యతలు నిర్వహిస్తున్నారు.