Connect with us

Associations

జార్జియా ఆల్బనిలో టిటిఎ చాప్టర్ ఏర్పాటు, ఘనంగా బతుకమ్మ సంబరాల నిర్వహణ

Published

on

జార్జియా రాష్ట్రం ఆల్బని పట్టణ ఇండియన్ అసోసియేషన్ వారు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association) వారి సహకారంతో అక్టోబర్ 1 శనివారం సాయంత్రం ఆల్బని లో సద్దుల బతుకమ్మ మరియు దసరా సంబరాలను మొట్టమొదటిసారిగా ఆనందంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆల్బని ఆడపడుచులు బంగారు బతుకమ్మను అందంగా అలంకరించి, గౌరీ పూజ చేసి, ఆట పాటలతో బతుకమ్మ పండగను జరుపుకున్నారు. పిల్లలకు బతుకమ్మ ప్రాముఖ్యతను తెలియచేస్తూ పెద్దలందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఈవెంట్ దాత, డ్రీమ్ రియాల్టీ అధినేత వెంకట్ గడ్డం, డా. పైళ్ల మల్లారెడ్డి మరియు డా. మోహన్ రెడ్డి పటలోల వారికి ఆల్బని ఇండియన్ అసోసియేషన్ వారు హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేశారు.

కొత్తగా ఏర్పాటు చేసిన జార్జియా రాష్ట్రం ఆల్బని పట్టణ టిటిఎ చాప్టర్ తో కలిపి మొత్తంగా అమెరికా అంతటా 41 చాప్టర్స్ ఉన్నట్టయింది. దీంతో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) దిన దిన ప్రవర్ధమానంగా వెలుగొందుతున్నట్లుంది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected