Connect with us

Events

అక్టోబర్ 8న దసరా బతుకమ్మ వేడుకలకు టిటిఎ చార్లెట్ ఘనంగా ఏర్పాట్లు

Published

on

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (Telangana American Telugu Association) ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా అమెరికాలోని పలు నగరాలలో బతుకమ్మ పండుగ వేడుకలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నార్త్ కేరోలినా రాష్ట్రం, చార్లెట్ నగరంలో TTA చార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో అక్టోబర్ 8 శనివారం రోజున స్థానిక స్టాల్లింగ్స్ ప్రాధమిక పాఠశాలలో దసరా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు.

వచ్చే శనివారం సాయంత్రం 3 గంటల నుండి 8 గంటల వరకు ఘనంగా నిర్వహించే ఈ బతుకమ్మ వేడుకలలో ప్రముఖ జానపద గాయకులు బిక్షు నాయక్ అందరినీ అలరించనున్నారు. బతుకమ్మ పోటీలు, దాండియా, జానపద పాటలు, నృత్యాలు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు, షాపింగ్ స్టాల్స్, డీజే మ్యూజిక్, ఉచిత పండుగ భోజనం అందరినీ ఆకట్టుకోనున్నాయి. మరిన్ని వివరాలకు [email protected] కి ఈమెయిల్ చేయండి.

ఈవెంట్ కి రెజిస్టర్ చేసుకోవడానికి https://NRI2NRI.com/TTACharlotteBathukamma2022 ని సందర్శించండి. టిటిఎ నేషనల్ లీడర్షిప్ సహకారంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నిషాంత్ సిరికొండ, రీజినల్ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ రెడ్డి కొత్తూర్, అడ్వైజర్స్ నవీన్ మల్లిపెద్ది & గోపాల్ కాసర్ల మరియు TTA చార్లెట్ చాప్టర్ టీం అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న దసరా బతుకమ్మ వేడుకలకు చార్లెట్ లోని తెలుగువారందరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected