Connect with us

Associations

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) లో అడ్వైజరీ & బోర్డు సభ్యుల మార్పు

Published

on

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (Telangana American Telugu Association – TTA) లో వివిధ కారణాల రీత్యా అడ్వైజరీ కౌన్సిల్ మరియు బోర్డులో మార్పులు చేర్పులు చేశారు. ఫిలడెల్ఫియా (Philadelphia) లో జరిగిన బోర్డు సమావేశంలో ఈ మార్పులు చేర్పులు జరిగినట్లు తెలిసింది.

TTA అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మన్ పదవి నుంచి టాలీవుడ్ హీరో డా. హరనాథ్ పొలిచెర్ల ని తప్పించి డా. విజయపాల్ రెడ్డి ని తిరిగి ఛైర్మన్ గా నియమించారు. అలాగే అట్లాంటా వాసి భరత్ రెడ్డి మాదాడి (Bharath Reddy Madadi) ని అడ్వైజరీ కౌన్సిల్ సభ్యునిగా నియమించారు.

దీంతోపాటు TTA బోర్డు సభ్యులలో కూడా మార్పుల అనంతరం నూతన బోర్డు సభ్యులను ప్రకటించారు. కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వివరాలు కింద ఫ్లయర్లో చూడవచ్చు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఎటువంటి మార్పులు చేయలేదు. వీటన్నిటికీ కారణాలు, ఇతరత్రా విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected