Connect with us

Events

New Jersey: 5000+ ఆహ్వానితులతో వైభవంగా TTA బతుకమ్మ సంబరాలు

Published

on

అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ అతివల పండగ అంటే మనందరికీ గుర్తుకొచ్చే పండగే బతుకమ్మ. TTA ప్రారంభమైన నుండి ఘనంగా, వైభవంగా ప్రతి సంవత్సరం అమెరికా అంతటా బతుకమ్మ పండగ జరుపుతోంది. TTA వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి ఆశీస్సులతో, అడ్వైజరీ చైర్ డా విజయపాల్ రెడ్డి, అడ్వైసరీ కో చైర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల, అడ్వైసరీ మెంబర్ భరత్ మాదాడి, సంస్థ అధ్యక్షులు వంశీ రెడ్డి గార్ల నిర్ధేశకత్వంలో మరియు నేషనల్ బతుకమ్మ అడ్వైసర్ గా సెక్రటరీ కవిత రెడ్డి గారి సూచనలతో ఈ సంవత్సరం కూడా అన్నిచోట్లా బతుకమ్మ పండగ సంబరాలు రంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి.

వేలాది మంది ఈ సంబరాలకు వచ్చి బతుకమ్మ పండగపై, తెలంగాణ సంస్కృతి పై తమకున్న అభిమానాన్ని చాటుతున్నారు. టిటిఎ అడ్వైసరీ కో చైర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల స్వంత రాష్టం న్యూజెర్సీ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. టిటిఎ జాయింట్ సెక్రటరీ శివారెడ్డి కొల్ల మరియు బోర్డు అఫ్ డైరెక్టర్స్ సుధాకర్ ఉప్పల, నర్సింహ పెరుక, నరేందర్ యారవ నేతృత్వంలో టిటిఎ న్యూజెర్సీ రీజినల్ వైస్ ప్రెసిడెంట్స్ మధుకర్ రెడ్డి, సాయి గుండూర్ ఆధ్వర్యమున Royal Albert Palace, Fords నగరము నందు శనివారం, Oct 21, 2023 న నిర్వహించిన సంబరాలు 5000 మందికి పైగా ఆహుతులతో కిక్కిరిసింది.

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పండగకు సంప్రదాయ అలంకారణతో, తము చేసిన బతుకమ్మ (Bathukamma) లతో వస్తున్న మహిళలు, పురుషులు మరియు పిల్లలతో సందడి మొదలయ్యింది. డప్పు చప్పుళ్లతో బతుకమ్మలకు ఘనమైన స్వాగతం లభించింది. ఈ సంబారాలకు 200 పైగా బతుకమ్మలు తీసుకొని వచ్చారు న్యూ జర్సీ వాసులు. వచ్చిన వారందరికీ అరుణ్ ఆర్కాల ఆధ్వర్యంలో TTA వాలంటీర్లు మధ్యాహ్నం 12 గంటలకు కమ్మటి సంప్రదాయ విందు భోజనం వడ్డించారు.

సాయి దత్త పీఠంకు చెందిన పురోహితులు మధు భాస్కర శర్మ గారు, డా. మోహన్ రెడ్డి పట్లోళ్ళ వారి శ్రీమతి శైలజ గార్లతో గౌరి దేవి పూజ చేయించి బతుకమ్మ పండగను ఆరంభించారు. TTA కమిటీ సభ్యులందరూ ఈ పూజలో పాల్గొన్నారు. TTA EVP నర్సింహా రెడ్డి దొంతిరెడ్డి రెడ్డి గారు, NJ RVPs మధుకర్ రెడ్డి, సాయి గుండూర్ వచ్చిన వారందరికీ ఆహ్వానం పలికారు. తన్విక, తారిక చేసిన మహిషాసుర మర్ధిని నృత్యంతో అందరినీ ఉత్తేజ పరిచారు.

ప్రముఖ నేపథ్య గాయని, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ విజేత సౌజన్య భాగవతుల గారి చక్కటి బతుకమ్మ పాటలతో కోలాహలం మొదలయ్యింది. శ్రీమతి దీప్తి యాయవరం కార్యక్రమానికి వ్యాఖ్యాత వ్యవహరించడమే కాకుండా చక్కటి పాటలతో మహిళలను మరింత ఉత్తేజ పరిచారు. అలాగే స్థానిక గాయని శ్రీజ బొడ్డు బతుకమ్మ పాటలను పాడి అందరినీ ఆనందింపజేసారు. చక్కగా అలంకరించుకొని, వేలాది మహిళలు, అమ్మాయిలు చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆడడం, ప్రముఖ గాయని సౌజన్య బతుకమ్మ పాటలు పాడడం – తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించింది.

బతుకమ్మల చుట్టూ తిరుగుతూ మహిళలు చేసిన లయ విన్యాసం అమోఘం అపూర్వం. వర్ణించడానికి మాటలు సరిపోని ఒక అనిర్వచనీయమైన అనుభూతి పొందారు వచ్చేసిన ఆహుతులంతా. తెలుగు నేల నుండి వచ్చిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ శ్రీ సత్య శ్రీనివాస్ గారు 12 అడుగుల ఎత్తైన అద్భుతమైన బతుకమ్మను అతి సుందరంగా తయారు చేశారు. ఈ బతుకమ్మ సంబరాలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నరసింహా పెరుక ఆధ్వర్యంలో శ్రీమతి దీప జలగం మరియు వాలంటీర్లు ఈ బతుకమ్మ తయారీకి సహాయం చేశారు.

ఈ సంబరాలకు తెలుగు కళా సమితి తన వంతు సహాయం అందజేసింది. TFAS అధ్యక్షులు మధు రాచకుళ్ల మరియు వారి కార్యవర్గం ఈ కార్యక్రమానికి విచ్చేసి సంబరాలలో పాల్గొన్నారు. అలాగే వివిధ స్థానిక మరియు జాతీయ సంస్థల (NATA, ATA, TANA, NATS) నుండి ప్రముఖులు విచ్చేసి ఈ సంబరాలలో తాము ఒక భాగం అయ్యారు. సుధాకర్ ఉప్పల గారు, శివా రెడ్డి గారు వీరందిరినీ వేదిక మీదికి ఆహ్వానించారు. అలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన కార్యావర్గాన్ని సభికులకు పరిచయం చేసారు.

PMJ Jewels వారు చక్కగా పేర్చిన బతుకమ్మలకు (మొదటి, రెండవ మరియు మూడవ స్థానంలో వచ్చిన వారికి) విలువైన బహుమతులు అందజేసారు. Maaya Fine Jewels వారు చక్కగా అలంకరించుకొన్న మహిళలో మొదటి, రెండవ మరియు మూడవ స్థానం లో ఉన్నవారికి చక్కని బహుమతులు అందజేసారు. దీప జలగం గారి ఆధ్వర్యంలో ఈ బహుమతి ప్రధానం జరిగినది. ఈ కార్యక్రమానికి న్యూ జర్సీ కి చెందిన స్థానిక నాయకులు, ప్రముఖులు విచ్చేసి అందరికీ తమ అభినందనలు, శుభాకాంక్షలు అందజేసారు.

వచ్చిన ప్రముఖులలో కొందరు – సామ్ జోషి (Mayor, Edison Township), అజయ్ పాటిల్ (Councilman, Edison Township) మరియు సామ్ థామ్సన్ (NJ State Senator) గార్లు తమ శుభాకాంక్షలు అందజేసారు. Sponsors / Donors / Artists అందరికీ జ్ఞాపికలు అందజేసారు. ఎడిసన్ నుండి, మరియు న్యూ జర్సీ రాష్ట్రం నుండి ప్రత్యేక Proclamations కూడా ఈ సంబరాలకు లభించాయి. TTA BOD నరేందర్ యారవ గారి ఆధ్వర్యంలో బతుకమ్మల నిమజ్జనం ఘనంగా జరిగినది.

TTA (Telangana American Telugu Association) న్యూ జెర్సీ టీం సభ్యులు మరియు పలువురు (ముఖ్యంగా యువత) ఈ బతుకమ్మ పండగ ఘనంగా జరగడానికి కృషి చేశారు. వస్త్రాలు, నగలు మరియు ఇతర విక్రేతలు తమ తమ స్టాల్స్ తో వచ్చిన వారికి షాపింగ్ సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమం ఘనంగా జరగడానికి తోడ్పడిన స్వచ్చంద సేవకులందరికీ, ధన సహాయం చేసిన దాతలకు, చక్కగా బతుకమ్మలను చేసిన మహిళలకు, మీడియాకు మా కృతజ్ఞతలు.

TTA Leadership Team from New Jersey: మోహన్ రెడ్డి పట్లోళ్ల (TTA Advisory Council Co-Chair), శివా రెడ్డి కొల్ల (TTA Joint Secretary & Board of Director)
TTA Board of Directors from New Jersey: సుధాకర్ ఉప్పల, నర్సింహ పెరుక, నరేందర్ యారవ
TTA Regional Vice Presidents: మధుకర్ రెడ్డి, సాయి గుండూర్
TTA Membership Chair: అరుణ్ రెడ్డి అర్కాల

TTA New Jersey Core Team: దీప జలగం, సంధ్య కాసుల, అనూష రెడ్డి, లలిత రెడ్డి, రాజా నీలం, ప్రశాంత్ నలుబంధు, శంకర్ రెడ్డి వులుపుల, శ్రీనివాస్ రెడ్డి మాలి, నవీన్ కౌలూరు, నవీన్ యలమండల, శ్రీనివాస్ జక్కిరెడ్డి, వెంకీ నీల, విష్ణు రెడ్డి, రఘువీర్ పి., శివ నారా, బాల గణేష్, సాయిరామ్ గాజుల, ప్రణీత్ నల్లపాటి, సతీష్ మేకల, శిల్ప రామడుగు
TTA NJ Youth Team: నిమిష పెరుక, ఆశ్రిత్ యారవ, హసిక ఆర్కాల, సుజయ్ వులుపుల, యాస్మిత బొమ్మూ, విద్యావతి అలవకొండ, ఇసితా రెడ్డి మాలి, వేదాంశి గొట్టుముక్కల, శృతి కృష్ణ పేరుమల, సుచిర్ బత్తిని, హర్షిత్ యారవ, రిషితా జంబుల

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected